గ్రామాల్లో దాడులకు పాల్పడితే ఉపేక్షించం

Jun 8,2024 22:15

ఫ్లాగ్‌ మార్చ్‌లో మాట్లాడుతున్న కె.గంగవరంఎస్‌ఐ జానీబాషా

ప్రజాశక్తి-రామచంద్రపురం

ఎన్నికలు ముగిసిన అనంతరం కె.గంగవరం మండలంలోని పలు గ్రామాల్లో కవ్వింపు చర్యలు, దాడులకు తెగబడుతున్నారని అటువంటివారిని ఉపేక్షించేది లేదని కె.గంగవరం ఎస్‌ఐ జానీ బాషా తెలిపారు. కె.గంగవరం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పలు గ్రామాల్లో శనివారం పారా మిలటరీ దళాలతో కవాతు నిర్వహించారు. ప్రస్తుత కాలంలో ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటినుండి కొన్ని పార్టీల వ్యక్తులు కవ్వింపు చర్యలకు తెగబడుతున్నారని, ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారని ఇటువంటి కార్యక్రమాలు పాల్పడినవారు ఎంతటి వారైనా చట్టప్రకారం శిక్షిస్తామన్నారు. గ్రామాల్లో అవాంఛనీయ సంఘటన జరగకుండా కె.గంగవరం మండలంలో స్పెషల్‌ ఫోర్స్‌తో కలసి ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించారు. సామాన్య ప్రజలకు, శాంతిభద్రతలకు విఘాతం కలగజేస్తే కఠిన చర్యలు తప్పవని, వారి పై కేసులు నమోదు చేసి, కోర్టుకు పంపిస్తామని హెచ్చరించారు. ఎన్నికల మొదటి నుంచి ఫలితాల వరకు శాంతియుతంగా ఉన్న కె.గంగవరం మండల ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే ఎవరికైనా శిక్ష తప్పదని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.

 

➡️