గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయాలి

Feb 12,2024 22:32
గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయాలి

ప్రజాశక్తి-రామచంద్రపురంఈ నెల 16న జరగనున్న దేశవ్యాప్త బంద్‌ను విజయవంతం చేయాలని న్యూ డెమోక్రసీ నాయకులు పిలుపునిచ్చారు. దీనిపై రామచంద్రపురం మండలంలోని భీమక్రోసుపాలెంలో సోమవారం ప్రచారం నిర్వహించారు. అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్త కిషాన్‌ మోర్చా వివిధ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త పారిశ్రామిక సమ్మె గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయాలని కోరారు. కరపత్రాలను పంపిణీ చేశారు. రైతుకూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు జె.సత్తిబాబు మాట్లాడుతూ దేశంలోని మోడీ, రాష్ట్రంలోని జగన్‌ ప్రభుత్వాలు రైతాంగంపైన, కార్మికులపైన, పేద ప్రజలపైన మోయ లేని భారం మోపుతూ వాళ్ళ హక్కులను కాల రాస్తున్నాయన్నారు. వీటికి వ్యతిరేకంగా కార్మిక కర్షక ప్రజాసంఘాలు పోరాడుతూనే ఉన్నాయన్నారు. ఆందోళన సందర్భంగా ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేదన్నారు. దీనికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 16న దేశవ్యాప్త కార్మిక సమ్మెను గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ప్రచారంలో అన్నం నాగు, విప్పర్తి సుబ్బలక్ష్మి, పలివెల సుబ్బమ్మ, బొమ్మిడి వెంకట్రావు, విప్పర్తి రాముడు, వై.పాపమ్మ, తాడి మంగ, వి.సూరమ్మ, పువ్వుల సాహెబ్‌ పాల్గొన్నారు.

➡️