గ్రామీణ యువత క్రీడల్లో రాణించాలి

Feb 10,2024 17:37

క్రీడలను ప్రారంభిస్తున్న వెంకన్న బాబు

ప్రజాశక్తి-మండపేట

గ్రామీణ యువ త క్రీడల్లో రాణిం చాలని వైఎస్సార్‌ సిపి రాష్ట్ర కార్యదర్శి దూలం వెంకన్న బాబు అన్నారు. మండలంలోని కేశవరం అంబేద్కర్‌ యూత్‌ కి వాలీబాల్‌ కిట్‌ లను ఆయన శనివారం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ క్రీడలు చదువునకు అదనపు అర్హతతో పాటు శరీర దారుణ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు యడ్ల రవి, కొక్కిరి కామేశ్వరరావు, నేతల సుధాకర్‌, యడ్ల చిట్టిబాబు, గుత్తుల రాజు, యువత పాల్గొన్నారు.

 

➡️