డిఎస్‌సి నోటిఫికేషన్‌ ప్రతుల దహనం

Feb 12,2024 22:31
డిఎస్‌సి నోటిఫికేషన్‌ ప్రతుల దహనం

ప్రజాశక్తి-అమలాపురం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో అప్రెంటిస్‌ విధానాన్ని ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో సోమవారం జిఒ కాపీలను దహనం చేశారు. ఉపాధ్యాయ రంగంలో సమస్యలను పరిష్కరించకపోగా, కొత్త సమస్యలను కావాలని సృష్టిస్తూ ఉద్యోగ ఉపాధ్యాయ, నిరుద్యోగ యువకులను మోసం చేసే విధంగా ముందుకు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు పి.వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శులు పి.మురుగేశ్వరరావు, పెన్నాడ శ్రీనివాసరావు, కె.శ్రీనివాసరావు, బిఎన్‌.వెంకటేశ్వరరావు, సత్తార్‌, రేణుక, ప్రసాద్‌, తోరం బాలాజీ, ఈశ్వరరావు, కెడివి.సత్యనారాయణ, గణేశ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

➡️