నేడు టిడ్కో ఇళ్ల పంపిణీ

Feb 13,2024 17:55

ఏర్పాట్లు పరిశీలిస్తున్న ఛైర్‌పర్సన్‌ రాణి తదితరులు

ప్రజాశక్తి-మండపేట

స్థానిక గొల్లపుంత కాలనీలోని అందరికీ ఇల్లు పథకంలో భాగంగా నిర్మించిన టిడ్కో గృహాలను బుధవారం లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లను మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పతివాడ నూక దుర్గ రాణి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంఎల్‌సి తోట త్రిమూర్తులు చేతుల మీదుగా ఈ ఇళ్ళ పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఫేజ్‌ వన్‌ లో 1344 యూనిట్స్‌ మిగిలి ఉండగా వాటిలో 1040 ఇళ్లకు రిజిస్ట్రేషన్‌ పూర్తయిందని వీటినే బుధవారం లబ్ధిదారులకు అందిస్తామన్నారు. ఆమె వెంట కౌన్సిల్‌ విప్‌ పోతంశెట్టి ప్రసాద్‌, మొండి మురళి, మహంతి అసిరినాయుడు, సాధనాల శివ భగవాన్‌,శెట్టి నాగేశ్వరరావు, టిడ్కో అధికారులు పాల్గొన్నారు.

 

➡️