పరిసరాల పరిశుభ్రతతో వ్యాధుల నిర్మూలన

Apr 2,2024 22:23

వెల్ల గ్రామం వద్ద గల వాటర్‌ ట్యాంకు పరిశీలిస్తున్న అధికారులు

ప్రజాశకి-ఆలమూరు

మన నివాసాల పరిసరాలలో పరిశుభ్రతతో వ్యాధుల నిర్మూలన సాధ్య పడుతుందని పిహెచ్‌సి వైద్యాధికారులు డాక్టర్‌ సువర్చల, డాక్టర్‌ మల్లికార్జునరావు అన్నారు. మండలంలోని చొప్పెల్ల పిహెచ్‌సి పరిధి 9 గ్రామాల వైద్య సిబ్బందికి ప్రత్యేక అవగాహన సదస్సు వారు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్య జీవితంలో ప్రజలు చేసే కొన్ని ఆశ్రద్ధ పనుల వల్ల రోగాల బారిన పడుతూ ఉంటారన్నారు. వాటిని దృష్టిలో ఉంచుకుని అనునిత్యం వారికి గుర్తుచేస్తూ జాగ్రత్తగా ఉండేలా చూడాలన్నారు. ఎవరైనా అస్వస్థతకు గురైతే వెంటనే వైద్యులను సంప్రదించాలని అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపిహెచ్‌ఒ కె.జ్యోతి కుమార్‌, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ సూర్యనారాయణ, హెచ్‌విఎఆర్‌బి మణి, హెచ్‌ఎస్‌ శివప్రసాద్‌, ఎఎన్‌ఎంలు, ఆశాలు, హెల్త్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

 

➡️