పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

Mar 31,2024 17:53

కర్ఫ్యూను తలపిస్తున్న రామచంద్రపురం ద్రాక్షారామ మెయిన్‌ రోడ్డు

ప్రజాశక్తి-రామచంద్రపురం

రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణతాపంతో రోడ్లన్నీ కర్ఫ్యూను తలపిస్తున్నాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడు గంటల వరకు జన సంచారం లేక రోడ్లన్నీ నిర్మానుష్యంగా తయారవుతున్నాయి. ఏడాది ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించడంతో జనం బెంబే లెత్తుతున్నారు. ఇక ఏప్రిల్‌ మే నెలలో మరింతగా ఉష్ణోగ్రతలు నమోదయ్య అవకాశం ఉండడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. ఎండ వేడికి తాళలేక పలువురు ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు.

 

➡️