బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం

Feb 11,2024 22:13

అగ్ని ప్రమాద బాధితులకు నిత్యావరాలు అందజేస్తున్న ఎంఎల్‌ఎ సతీష్‌

ప్రజాశక్తి-ఐ.పోలవరం

అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు అం డగా ఉంటామని ముమ్మడి వరం ఎంఎల్‌ఎ పొన్నాడ వెంకట సతీష్‌ కుమార్‌ అన్నారు. తిల్లకుప్ప గ్రామం లో ఆదివారం అగ్ని ప్రమాదం సంభవించి మూడు ఇల్లు తాటాకు ఇల్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ విషయం తెలుసుకొన్న ఎంఎల్‌ఎ సతీష్‌ కుమార్‌ సర్వం కోల్పోయిన బాధితులను పరామర్శిం చారు. రూ25 వేల సహాయాన్ని ఆయన అందజేశారు. అలాగే ప్రభుత్వం ద్వారా బాధితుల కు ఒక్కో కుటుంబానికి 10 కేజీల బియ్యం అందజేశారు. ఆలాగే ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ ద్వారా బాధితులకు హైజానికి కిట్లు, వంట సామ గ్రి, నిత్యావసర సరుకులు, రైసు 25 కేజీలు, టార్పాలిన్‌, కూరగాయల కిట్లను రెడ్‌ క్రాస్‌ ప్రతినిధులు చైర్మన్‌ కోరుకొండ సత్యనారాయణ, పిన్నమరాజు వెంకటపతిరాజు, సతీష్‌రాజు అందజేశారు కార్యక్రమంలో ఎంపిపి మోర్త రాణి మిరియం జ్యోతి, సర్పంచ్‌ కడియం తమయ్య, సొసైటి అధ్యక్షులు వెంకటేశ్వరావు, రేవు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

 

➡️