సమావేశంలో మాట్లాడుతున్న మండల ప్రత్యేక అధికారి కర్నిడి మూర్తి
ప్రజాశక్తి – అల్లవరం
మండల స్థాయిలో పరిష్కారం కానీ సమస్యలు తమ దృష్టికి తీసుకురావాలని పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని మండల ప్రత్యేక అధికారి కర్నిడి మూర్తి పేర్కొన్నారు. స్థానిక మండలం పరిషత్ కార్యాలయంలో ఎంపిపి యిళ్ల శేషగిరిరావు అధ్యక్షతన మండల పరిషత్ సమావేశం గురువారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మండల ప్రత్యేక అధికారి కర్నిడి మూర్తి హాజరయ్యారు. సమావేశంలో 2024 -2025 సంవత్సరం సవరణ అంచనాలు బడ్జెట్ మొత్తం రూ.31,44,75,002, 2025-2026 సంవత్సరం అన్ని పద్దులు నుంచి బడ్జెట్ ఆదాయపు అంచనాలు రూ.32,95,18,600, వ్యయం అంచనాలు రూ.34,94,79,800 బడ్జెట్ ప్రవేశపెట్టారు.. ఎంఇఒ కిరణ్ బాబు మాట్లాడుతూ మండలంలో గోడి గురుకుల బాలికల పాఠశాల విద్యార్థిని తయ్యారు చేసిన మ్యాజికల్ అంబ్రెల్ల మండలం, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో మొదటి బహుమతి సాధించింది అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి హైస్కూల్ విద్య ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు, ప్రయిమరీ పాఠశాలలు ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు పాత విధానంలో కొనసాగుతాయన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ స్వామి మాట్లాడుతూ జల జీవన్ మిషన్ ద్వారా పాత ప్రాజెక్టులు మార్చి 31 లోపల పూర్తి చేస్తామన్నారు. కొత్తగా రూ.60 కోట్లతో చేపట్టి వలసిన పనులకు అంచనాలు తయారు చేసి పంపామన్నారు. డ్రయిన్స్ ఎఇ సునీత మాట్లాడుతూ డ్రయిన్స్‌లో తూడు తొలగించడానికి చిన్న డ్రెయిన్స్‌లో పూడికతీతకు ఎస్టిమేషన్ సిద్ధం చేసి పంపామన్నారు. పెద్ద డ్రెయిన్స్‌కు సంబంది óంచి నాబార్డ్, డిజాస్టర్ మేనేజ్మెంట్‌కు చేయవలసిన పనులకు అంచనాలతో ప్రతిపాదనలు పంపామన్నారు. సందర్భంగా సభ్యులు దాళ్వా సాగుకు నీరు ఎద్దడి లేకుండా చూడాలని, డ్వాక్రా గ్రూపులో యాని మేటర్లు సభ్యులు నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, గత ప్రభుత్వంలో చేసిన పనులకు బిల్లులు అవ్వలేదని, గ్రామాల్లో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఉన్నాయని రాత్రి వేళలో తీరం వెంబడి అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని వాటిపై సంబధిత అధికారులు చర్యలు తీసు కోవాలన్నారు. గ్రామాలలో కుక్కల సమస్య అధికంగా ఉందని, మండల సమావేశానికి మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరు అయ్యేలా చూడాలన్నారు. పలు సమస్యలపై అధికారులను నిలదీశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ సమస్యలపై విచారణ చేసి సంబంధిత పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కొత్త పెన్షన్, రేషన్ కార్డులు, ఇంటి స్థలాలు, ఇంటి నిర్మాణానికి లోన్లు సంబంధించి సభ్యులు అడగగా ప్రభుత్వం నుంచి గైడ్లైన్స్ రాలేదని వచ్చిన వెంటనే తెలియజేస్తామన్నారు. గ్రామాల్లో చేపడుతున్న సర్వేలు, అభివృద్ధి పనులు తమకు దృష్టికి తీసుకురావడం లేదని కొంతమంది సర్పంచులు ,ఎంపీటీసీలు దష్టికి తీసుకురాగా ఇకపై ప్రజా ప్రతినిధులకు తెలియజేయాలని అధికారుల కు సూచించారు. వివిద శాఖల అధికారులు మండలం చేపడుతున పనులు, చేయవలసిన పనులకు సంబంధించిన ప్రపోసల్స్ ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ కృష్ణమోహన్, తహశీల్దార్ వివిఎల్.నరసింహారావు, జడ్‌పిటిసి సభ్యురాలు కొనుకు గౌతమి, వైస్ ఎంపిపి వడ్డీ గంగ, పల్లి జేమ్స్, మండల స్థాయి అధికారులు ,సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు పాల్గొన్నారు.