వాలంటరీలకు బహుమతులు అందజేత

Feb 21,2024 16:37

వాలంటరీలకు బహుమతులు అంజేస్తున్న వైసిపి నాయకులు

ప్రజాశక్తి-ఐ.పోలవరం

జి.మూలపొలం గ్రామ పంచాయితీ పరిధిలో పని చేస్తున్న గ్రామ వాలంటరీలకు ఇంటి పన్ను త్వరగా వసూలు చేసిన నందుకు గాను పంచాయతీ కార్యదర్శి పి.వెంకటేశ్వరరావు సమక్షంలో వైసిపి నాయకులు మందపాటి బైరవస్వామి, కాటం సత్తిరాజు చేతుల మీదుగా వాలంటరీలకు బుధవారం ముగ్గురికి బహుమతులు అందజేశారు. వీరిలో మొదటి బహుమతి 12వ వార్డుకు చెందిన పోతాబత్తుల దేవిక, రెండవ బహుమతి 7వ వార్డుకు చెందిన కాగిత వీరబాబు, మూడవ బహుమతి 10వ వార్డుకు చెందిన ఓలేటి పద్మ అందుకున్నారు. వీరిని పలువురు అభినదించారు.

 

➡️