శెట్టిబలిజల ఆత్మీయ సమావేశం

Mar 31,2024 17:52

సమావేశంలో మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ వేగుళ్ల

ప్రజాశక్తి-మండపేట

బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ అని ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. స్థానిక ఏడిద రోడ్డులో ప్రయివేట్‌ ఫంక్షన్‌ హాల్లో ఆదివారం శెట్టి బలిజల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ వేగుళ్ల జోగేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ బిసిలు అంటేనే టిడిపి అని అన్నారు. నియోజకవర్గంలో వైసిపి నాయకుల మాటలు వేరు చేసే పనులు వేరన్నారు. రామచంద్రపురంలో శెట్టి బలిజలను ఏవిధంగా ఇబ్బందులు పెట్టారో గుర్తుచేశారు. ఈ ఎన్నికల్లో తనను, సుభాషను ఎమ్మెల్యేలు గా గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో శెట్టిబలిజలను ఆర్థికంగా అణగదొక్కిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వచ్చే ఎన్నికల్లో శెట్టిబలిజలంతా బుద్ది చెప్పాలని రామచంద్రపురం టిడిపి ఎంఎల్‌ఎ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్‌ అన్నారు.

 

➡️