శ్రీ చైతన్యలో ‘ఫ్యామిలీ ఫెస్ట్‌

Feb 21,2024 16:34

పాల్గొన్న విద్యార్థులు, తల్లిద్రండులు

‘ప్రజాశక్తి-మండపేట

విద్యార్థులకు తల్లిదండ్రుల పట్ల గౌరవం, నైతిక విలువలు పెంపొందించడంలో భాగంగా ఫ్యామిలీ ఫెస్ట్‌ తదితర కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని మండలంలోని తాపేశ్వరం శ్రీ చైతన్య స్కూల్‌ ప్రిన్సిపల్‌ లక్ష్మీనారాయణ అన్నారు. బుధవారం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల పట్ల గౌరవంతో మెలిగి క్రమశిక్షణతో నడుచుకోవాలన్నారు. ప్రతి నెలా నిర్వహించే స్మార్ట్‌ లివింగ్‌ ప్రోగ్రా మ్స్‌ లో భాగంగా ఇప్పటి వరకు హరిత భారత్‌, బి హెల్తీ బి హ్యాపీ, జయహో భారత్‌, సేఫ్‌ ఆన్‌ రోడ్‌, జై కిసాన్‌ జై భారత, ఫ్యామిలీ ఫెస్ట్‌ వంటి కార్యక్రమాలను నిర్వహించా మన్నారు. కార్యక్రమంలో డీన్‌ అరుణ్‌, సి.ఇం ఛార్జి సతీష్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

 

➡️