అంబాజీపేట పిహెచ్‌సి వైద్యాధికారిణికి వినతిపత్రం అందిస్తున్న 104 జిల్లా ప్రధాన కార్యదర్శి త్రిమూర్తులు, రాజకుమారి
ప్రజాశక్తి – అంబాజీపేట
104 సర్వీసులను గతంలో మాదిరిగానే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా నిర్వహించాలని ఇలా చేయుట వలన నిర్వహణ ఖర్చు రూ.50 వేలు మాత్రమే అవుతుందని 104 అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.త్రిమూర్తులు అన్నారు. వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మంగళవారం అంబాజీపేట పిహెచ్‌సి వైద్యాధి óకారిణి వి.గౌతమికి జిల్లా ప్రధాన కార్యదర్శి పి.త్రిమూర్తులు, జిల్లా ఉపాధ్యక్షులు యల్.రాజ్‌కుమారి అందజేశారు. అరవిందు యాజమాన్యం చెల్లించాల్సిన జీతాలు వెంటనే చెల్లించాలని, 2020లో చేరిన ఉద్యోగులకు జిఒ నెం. 7 ప్రకారం వేతనాలు చెల్లించాలని, శ్లాబ్ విధానాన్ని అమలు చేయాలని, పిఎఫ్ మరియు ఇఎస్‌ఐ యాజమాన్యం వాటా చెల్లించాలని, ప్రతి వాహనం నకు ఫిట్నెస్ ఇన్సూరెన్స్ చేయించాలని తదితర డిమాండ్ల ను వినతిపత్రంలో పేర్కొన్నారు.