అక్షర యోధుడు రామోజీరావుకి చిత్ర నివాళి

Jun 9,2024 10:19 #Konaseema

ప్రజాశక్తి-అమలాపురం రూరల్ : రామోజీరావు కి నా చిత్ర నివాళి అంటూ అమలాపురం కు చెందిన చిత్రకారుడు పోలిశెట్టి నరసింహ చంద్రకుమార్ వాటర్ కలర్స్ ఉపయోగించి ఆదివారం రామోజీ చిత్రాన్ని పెయింటింగ్ వేశారు. ఈ చిత్రం పలువురిని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా రామోజీరావు గురించి కుమార్ మాటల్లో ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు కన్నుమూశారు. ఆయన శనివారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు.రామోజీరావు ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లా, పెదపారుపూడి లో 1936 నవంబర్ 16 న రైతు కుటుంబంలో జన్మించారు. తల్లి వెంకట సుబ్బమ్మ తండ్రి వెంకట సుబ్బారావు. రామోజీరావు స్థాపించిన రామోజీ గ్రూప్ ఆధీనంలో ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియో రామోజీ ఫిలిం సిటీ ఉంది. 2016 లో సాహిత్యం విద్య విభాగాలలో భారత ప్రభుత్వం అతనికి దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణంతో సత్కరించింది.రైతే రాజు అని అందరూ మాటల్లో చెప్పారు కానీ ఆయన వారి కోసం ఏదైనా చేయడానికి ముందడుగు వేశారు.అందరి జీవితాల్లో వెలుగులు నింపడానికి ఆరుగాలం రైతన్న కష్టపడే కష్టం అంతా ఇంతా కాదు ఆ అన్నదాతకు ఉన్నంత అండగా ఉండాలని రామోజీరావు ఏనాడో సంకల్పించుకున్నారు. మాధ్యమం ఏదైనా రైతు సంక్షేమానికే అనుకున్నారు. ఇందుకు ఫలితమే 1969 లో ప్రారంభించిన అన్నదాత మాసపత్రిక ఆ తర్వాత వచ్చిన ఈనాడులో రైతే రాజు, ఈటీవీ2లో జైకిసాన్ ఇప్పటికీ అన్నదాత కార్యక్రమం ఈటీవీ లోని ప్రసారమవుతుంది.

➡️