ఎసిబి వలలో రావులపాలెం సిఐ

May 25,2024 15:18 #ACB Raids, #Konaseema

ప్రజాశక్తి – ఆలమూరు(డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా) : డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా రావులపాలెం సిఐ ఆంజనేయులు ఎసిబి వలకు చిక్కారు. రావులపాలెం పోలీస్‌స్టేషన్‌లో రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఎసిబి డిఎస్‌పి శ్రీహరిరాజు తెలిపిన వివరాల మేరకు… గత నెలలో కోడిపందేల శిబిరాలపై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడిలో కుచ్చర్లపాటి లక్ష్మణరాజు పట్టుబడ్డాడు. రౌడీషీట్‌ ఓపెన్‌ చేయకుండా ఉండాలంటే రూ.50 వేలు లంచం ఇవ్వాలని లక్ష్మణరాజును సిఐ ఆంజనేయులు డిమాండ్‌ చేశారు. వేధింపులు ఎక్కువ అవ్వడంతో ఎసిబి అధికారులను లక్ష్మణరాజు ఆశ్రయించారు. వారి సూచనల మేరకు శనివారం పోలీస్‌స్టేషన్‌లో లక్ష్మణరాజు లంచం ఇస్తుండగా దాడి చేసి సిఐ ఆంజనేయులును రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రాజమండ్రి ఎసిబి కోర్టుకు ఆయన్ను తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని ఎసిబి డిఎస్‌పి తెలిపారు.

➡️