ఎస్‌డబ్ల్యూసి షెడ్డు ప్రారంభిస్తున్న సర్పంచ్ భవాని
ప్రజాశక్తి – ఆలమూరు
సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పార్క్‌ల ద్వారా గ్రామ స్వచ్ఛతకు చర్యలు చేపట్టామని సర్పంచ్ తోట భవాని, వెంకటేశ్వర్లు అన్నారు. నందిపూడిలో ఎస్‌డబ్ల్యూసి విభాగాన్ని కార్యదర్శి ఎస్.వీర్రాజు సమక్షంలో కూటమి శ్రేణులతో కలసి బుధవారం ఆమె ప్రారంభించారు. సర్పంచ్ మాట్లాడుతూ పల్లెల్లో ఎస్‌డబ్ల్యూసి వినియోగంలోకి వస్తే పరిశుభ్రతకు బాటలు వేసిన వారమవుతామన్నారు. గ్రామస్తులు తమ నివాసాలలో వచ్చే చెత్తను తడి, పొడి విడివిడిగా పారిశుధ్య కార్మికులకు అందజేసి సహకరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి సభ్యుడు తోలేటి సంతోషి, నేతలు తోట వెంకటేశ్వర్లు, దొడ్డ సుబ్బారావు, నల్ల వెంకన్న, కాశీ విశ్వనాథం, గుత్తుల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.