అర్జీలు పరి ష్కారానికి చర్యలు : కలెక్టర్‌

Dec 9,2024 16:58
IMG

అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్‌ మహేష్‌ కుమార్‌

ప్రజాశక్తి – అమలాపురం

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీలను రీఓపెన్‌ కు ఆస్కారం లేకుండా చర్య లు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వ హించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్య క్రమంలో కలెక్టర్‌ మహేష్‌కమార్‌, జెసి టి.నిషాంతి, డ్వామా పీడీ మధుసూదన్‌, ఐసిడిఎస్‌ పీడీ ఝాన్సీ రాణిలు అర్జీదారుల నుంచి 168 అర్జీలు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసంలో సామాజిక భద్రత పింఛన్ల మం జూరు, వైద్య సేవలు కల్పన, భూసమస్యలు, తదితర అంశాలపై అందాయి. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులపై ప్రత్యేక దష్టి సారించి 15 రోజుల కాల వ్యవధిలో పరిష్కరించాలని, సిఎం, మంత్రుల కార్యాలయాల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత నివ్వాలన్నారు. ఫిర్యాదుల పరిష్కారానికై నోడల్‌ అధికారులు, సిబ్బందికి ఫిర్యాదుల పరిష్కార విషయంలో ఓరియంటేషన్‌ ప్రోగ్రామ్‌ నిర్వహించాలన్నారు. ప్రజా ఫిర్యాదులు పరిష్కరించే సందర్భంలో అర్జీదారులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించాలన్నారు. మండల స్థాయి లో వచ్చే ఫిర్యాదులను మండల స్థాయిలోనే పరిష్కరించేలా చూడాలన్నారు. పరిష్కారం కానీ ఫిర్యాదులు గురించి సంబంధిత ఫిర్యాదుదారునితో కూలంకషంగా చర్చించి తిరస్కరణకు గల కారణాలను తెలియ చేయాలన్నారు. అర్జీలకు వంద శాతం పరిష్కారాలు చూపాలన్నారు. ప్రతి సమస్యను ప్రజల నుంచి వచ్చే ఫీడ్‌ బ్యాక్‌ ను ప్రభుత్వం మూడు అంచెలలో సీరియస్‌గా పరిశీలిస్తుందన్నారు. అధికారులందరూ ప్రాధాన్యతగా ఫి ర్యాదులను నూరుశాతం నాణ్యతతో పరిష్కరించా లన్నారు. ఇప్పటికే పెండింగ్లో ఉన్న దరఖాస్తు లపై వెంటనే చర్యలు తీసుకుని పరిష్కరించాలన్నారు. సమస్యను తీసు కొని పరిష్కారం కోసం ఎంతోవ్యయ ప్రయాసలకోర్చి అర్జీదారులు అధికారుల వద్దకు వస్తారని, వారి సమస్య ను సావధానంగా వింటూ నిర్దేశిత గడువు లోగా పరిష్కార మార్గాలు అత్యంత నాణ్యతతో చూపాలని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

➡️