ఒహెచ్‌ఎస్‌ఆర్ వాటర్‌ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న ఎంఎల్‌ఎ
ప్రజాశక్తి – కొత్తపేట
కొత్తపేట నియోజకవర్గంలో తాగునీటి సమస్య లేకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటానని స్థానిక ఎంఎల్‌ఎ బండారు సత్యానందరావు తెలిపారు. నియోజకవర్గంలో ప్రతీ గ్రామంలో ఇంటింటికే తాగు నీరు అందించేందుకు కృషి చేస్తున్నానని తెలిపారు. జల్ జీవన్ మిషన్ ద్వారా కొత్త పేట గ్రామం పనసలదొడ్డిలో రూ.57.20 లక్షలతో, పెదగూళ్లపాలెంలో రూ.57.20 లక్షలతో, మందపల్లి రూ.66 లక్షలతో ఒహెచ్‌ఎస్‌ఆర్ వాటర్ ట్యాంకు లకు శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. అదేవిధంగా ప్రతీ గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కారం చేస్తానని ఎంఎల్‌ఎ సత్యానందరావు అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.విద్యాభివృద్ధికి కృషిఆత్రేయపురం : విద్యాభివృద్ధికి తన వంతు చూసి చేస్తానని కొత్తపేట ఎంఎల్‌ఎ ఎంఎల్‌ఎ బండారు సత్యానందరావు అన్నారు. శుక్రవారం ఆయన మెర్లపాలెం శివారు వాసంశెట్టివారిపాలెంలో ఎంపిపి పాఠశాలలో రూ.24 లక్షల తో నూతనంగా నిర్మించిన అదనపు గదులను ఎంఎల్‌ఎ బండారు సత్యానందరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల భవన నిర్మాణానికి అవసరమైన నిధులను గ్రామస్థులు సేకరించి పనులు పూర్తి చేయడం అభినందనీయమన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా గ్రామస్తులు ఈ నిర్ణయం తీసుకోవడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు .పాఠశాలకు అవసరమైన కాంపౌండ్ వాల్ నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించడంతో పాటు త్వరగా పనులు పూర్తి చేస్తామని సత్యానందరావు గ్రామస్తులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కెవి.సత్యనారాయణ రెడ్డి, ముదునూరి వెంకటరాజు, గుత్తుల రాంబాబు, చిలువూరి సతీష్‌రాజు, అయినవిల్లి సత్తిబాబుగౌడ్, సర్పంచ్ మెర్ల రాము, మలవరపు నాగరాజు, కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.