సాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు

Mar 22,2025 17:06
IMG

వివిధ శాఖఅ అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌

ప్రజాశక్తి – అమలాపురం

డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో ప్రస్తుత రబీ సీజన్లో ఆయకట్టు చిట్ట చివరి భూముల వరకు సాగునీటి ఎద్దడి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ా్ల కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ ఆదేశించారు. సాగునీటి విని యోగాన్ని గరిష్టతరం చేస్తూ వారా బంది, క్రాస్‌ బండ్ల ఏర్పా టు ద్వారా సవ్యంగా నీరు సరఫరా చేయాలన్నారు. శనివారం స్థానిక కలెక్టరేట్‌ నందు జలవనరులు డ్రెయినేజీ, వ్యవసాయ అధికా రులతో సమావేశం నిర్వ హించారు. సాగునీటి ఎద్దడి సమస్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగు నీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రెవెన్యూ వ్యవసాయ జల వనరుల శాఖలు కీలక పాత్ర పోషించాలన్నారు. క్షేత్రస్థాయి ఎఇలు, ఎఒలు సమన్వ యంతో సాగునీటి విని యోగాన్ని గరిష్టతరం చేస్తూ వారా బందీ విధానం క్రాస్‌ బండ్లు వేసి ఆయిల్‌ ఇంజిన్లతో సాగునీటి సరఫరా చేస్తూ సాగు నీటి ఎద్దడి సమస్యలను అధి గమిం చాలన్నారు .రబీ సీజన్లో ఏప్రిల్‌ 15 వరకు సాగునీటి సరఫరా పట్ల అప్రమత్తంగా ఉంటూ పంటలను కాపాడుకునే దిశగా రైతాంగానికి తోడ్పా టును అందించాలన్నారు. త్వరలో సీజన్‌ ముగుస్తుం డటంతో కాలువల ఆయకట్టు చివరి రైతులకు సాగు నీరందించేందుకు వాటర్‌ మేనేజ్మెంట్‌ చేసుకోవాలని ఆదేశించారు.రెవెన్యూ, ఇరిగేషన్‌ సమన్యయం చేసుకుంటూ వారాబంది పకడ్బందీగా నిర్వహిస్తూ ఆఖరి ఎకరం వరకు నీరు అందించాలని అధికారులను ఆదేశించారు. ఆర్‌డిఒలు తమ పరిధిలోని మండలాల వారిగా నీటి ఎద్దడి గ్రామాలు విస్తీర్ణాలు వారిగా నివేదిక రూపొందించి సాగునీరు సమద్ధిగా అందేలా వారానికి రెండు పర్యాయాలు పర్యవేక్షించాలని సూచించారు. లేనిపక్షంలో పంట దిగుబడులు తగ్గిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. రాజోలు మండలంలో సుమారు 70 ఎకరాలు, అమలాపురం మండలంలో 96 ఎకరాలు, ఉప్పలగుప్తం మండలంలో 100 ఎకరాలు, అల్లవరంలో 80 ఎకరాలు, మామిడి కుదు రులో 100 ఎకరాలు, అంబాజీపేట చివరి ఆయకట్టులో 100 ఎకరాలకు నీటి ఎద్దడి సమస్య ఉన్నట్లు ఆయన తెలిపారు. వీటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి సాగు నీటిని తప్పనిసరిగా సరఫరా చేయాలని ఆదేశించారు. ఈ సమావే శంలో జాయింట్‌ కలెక్టర్‌ టి నిశాంతి, ఆర్‌డిఒలు దేవర కొండ అఖిల, కె.మాధవి, పి.శ్రీకర్‌, జలవనరులు, వ్యవసాయ శాఖ, డ్రెయినేజీ విభాగం ఇంజ నీర్లు తదితరులు పాల్గొన్నారు. జల భద్రత తోనే భవిత సురక్షితం మానవాళి మనుగడకు నీరే ప్రాణాధారమని,జల భద్రత తోనే భవిత సురక్షితమని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ పేర్కొన్నారు. ప్రపంచ జల దినోత్సవాన్ని నాబార్డ్‌ కోనసీమ జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్‌ నందు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జల సంరక్షణపై దిశా నిర్దేశం చేస్తూ భవిష్యత్తులో ఎదుర్కొనబోయే నీటి యాజమాన్య సవాళ్ళను గురించి ప్రస్తావించారు. తదనుగుణంగా శాస్త్రవేత్తలు, అధికారులు, సంబంధిత సంస్థలు సంయుక్త ప్రణాళికలు రచించుకుని ముందుకు సాగాలని ఆకాంక్షించారు. నీటి ప్రాముఖ్యత, సరఫరా, పరిరక్షణ అవసరాన్ని గుర్తు చేసుకోవడం దీని ముఖ్య ఉద్దేశ్యమన్నారు. భవిష్యత్తులో ఎదురయ్యే నీటి సంక్షోభాలను అధిగమించేందుకు ప్రజల్లో అవగాహన పెంపొందించాలనేది ప్రధాన లక్ష్యమన్నారు. 2025 ప్రపంచ జల దినోత్సవాన్ని హిమానీనదాల సంరక్షణ, మంచినీటి వనరుల రక్షణ, వాతావరణ మార్పుల ప్రభావాన్ని అరికట్టే చర్యలపై చర్చించేందుకు ఉద్దేశించారన్నారు మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నీటి వనరుల పరిరక్షణ అనే అంశంపై జరిగిన ఈ సదస్సు లో జాతీయ జల సంస్థకు చెందిన శాస్త్రవేత్త వై.శివప్రసాద్‌ పాల్గొని తమ పరిశోధనా అంశాలను సదస్సుకు హాజరైన వివిధ శాఖల అధికారులతో పంచుకున్నారు. జిల్లా అటవీ అధికారి ఎంవి.ప్రసాదరావు పాల్గొని ప్రసంగిస్తూ, కోనసీమ జిల్లాలో తీర ప్రాంత కొత్త మడ అడవుల పరిరక్షణ, ఉప్పు నీటి ప్రవాహాలతో ముప్పు తదితర అంశాల పై చర్చించారు. సముద్ర తీరం వెంబడి ఉన్న మడ అడవుల సంరక్షణ ద్వారా తీర ప్రాంత ప్రజానీకం సంరక్షింపబడుతున్నారని అదే విధంగా మత్స్య సంపద అభివృద్ధి ఈ అడవులు దోహద పడుతున్నాయన్నారు. జీవవైవిధ్యం సమతుల్యత, జీవనోపాదులు పెంపుదలకు సహజ వనరుల బలోపేతానికి మడ అడవులు దోహదపడతాయన్నారు. ఈ సందర్బంగా భవిష్యత్తులో వాతావరణంలో మార్పులు, జల వనరులపై దాని ప్రభావం సవాళ్లు ఎదుర్కొనాల్సిన అంశాలపై రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. జాతీయ జల సంస్థకు చెందిన శాస్త్రవేత్త శివప్రసాద్‌ పెరుగుతున్న వాతావరణ మార్పుల వలన గోదావరి డెల్టా భూగర్భ జలవనరులలో పెరుగుతున్న సాలైనిటీ ఇతర మార్పులను నిశితంగా వివరించారు. నాబార్డ్‌ డిడిఎం డాక్టర్‌ వై.యస్‌. నాయుడు తన ప్రెసెంటేషన్‌ ద్వారా వాతావరణ మార్పులకు సంబంధించి నాబార్డ్‌ ద్వారా వ్యవసాయ అనుబంధ రంగాలో ప్రాజెక్టులు ఏర్పాటు చేయడంతో పాటుగా కాట్రేనికోన ప్రాంతంలో ఎండు చేపల తయారీ కొరకు సోలార్‌ డ్రైయర్స్‌ కొరకు నాబార్డ్‌ ద్వారా యూనిట్లు ప్రతిపాదించామన్నారు. వాతావరణ మార్పుల చర్యలపై అవగాహన సదస్సుకు విచ్చేసిన అధికారులు, శాస్త్ర వేత్తలు, ఎన్‌జిఒ తదితర చమురు సహజ వాయువు సంస్థల ప్రతినిధులు లైన్‌ డిపార్ట్మెంట్‌ అధికారులతో ఉమ్మడిగా చర్చించారు. ఈ కార్య క్రమంలో ఎల్‌డిఎం కేశవ వర్మ, వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

➡️