పి.గన్నవరంలో పూలే జయంతి వేడుకలలో ఎంఎల్‌ఎ గిడ్డి
ప్రజాశక్తి – పి.గన్నవరం
సమసమాజ స్థాపన కొరకు సొంత నిధులతో పాఠశాలను స్థాపించిన అక్షర ప్రదాత, సంఘ సంస్కర్త జ్యోతిరావు ఫూలే అని పి.గన్నవరం ఎంఎల్‌ఎ గిడ్డి సత్యనారాయణ అన్నారు. పి.గన్నవరం డొక్కా సీతమ్మ ఆక్విడెక్ట్, ఎంఎల్‌ఎ పార్టీ కార్యాలయం వద్ద మహాత్మ జ్యోతిరావు ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి 199 వ జయంతి వేడుకలను కూటమి నాయకులు సమక్షంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పలువురు మాట్లాడుతూ ఇల్లాలి చదువు ఇంటికి వెలుగని అక్షరాస్యతకై నడుం బిగించిన విద్యా జ్యోతి స్త్రీ విద్యావ్యాప్తికుడు జ్యోతిరావు పూలే అని అన్నారు. ఫూలే సమాజానికి చేసిన సేవా కార్యక్రమాలను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొండాడ నాగమణి, నియోజవర్గ టిడిపి కన్వీనర్ నామన రాంబాబు, టిటిడి పాలక మండలి మాజీ సభ్యులు డొక్కా నాథ్ బాబు, సంసాని పెద్దిరాజు, వాసంశెట్టి కుమార్, చొల్లంగి సత్తిబాబు శేరు శ్రీను గుత్తుల రామకృష్ణ, యండ్రా శ్రీను, అరుమిల్లి సాయిబాబు, బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు రామకష్ణ, ఈశ్వరరావు, యడ్ల ఏసుబాబు, దొమ్మేటి వెంకటేశ్వర్లు, ఆదిమూలం సూర్యకాపు, గుడాల సంపత్ చీకట్ల రామకృష్ణ, మూసినా వెంకటేశ్వరావు, బొరుసు సుబ్బరాజు, శేరు త్రిమూర్తులు, తాటికాయల శ్రీను, కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.