ప్రజాశక్తి-కపిలేశ్వరపురం : మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగర లో నిర్వహించిన పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమంలో అంగర, పడమర ఖండ్రిక జనసేన నాయకులు పాల్గొని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆయన చేసిన త్యాగం వల్లే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని పలువురు వక్తలు కొనియాడారు. కార్యక్రమంలో అంగర సాగు నీటి సంఘం ప్రెసిడెంట్ కొమ్ముశెట్టి సూరిబాబు, పిల్లా బసవరాజు, అంగర గ్రామ ఉపాధ్యక్షులు తోరాటి శ్రీను, దానేటి శరత్, చీకట్ల గంగరాజు , సుంకర బుజ్జి, కాయల వీర్రాజు, రాంబాబు శర్మ , మేడిద రాంబాబు, సంకాబత్తుల సుభాష్, తదితరులు పాల్గొన్నారు.
