పేలుడు బాధిత కుటుంబాలకు సాయం

Sep 29,2024 22:29
పేలుడు బాధిత కుటుంబాలకు సాయం

ప్రజాశక్తి-అమలాపురం ఇటీవల అమలాపురం పట్టణం రావులచెరువులో గ్యాస్‌ సిలెండర్‌ విస్ఫోటనం ధాటికి తీవ్రంగా గాయపడిన ఏడుగురికి జిఎస్‌ఆర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ తరఫున సేకరించిన రూ.2.60 లక్షల నగదును బాధిత కుటుంబ సభ్యులకు ఆదివారం తెలంగాణ రాష్ట్ర శెట్టిబలిజ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గుత్తుల మీరాకుమార్‌ అందజేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తాన్ని అందించి జిఎంఆర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ సంస్థ ప్రతినిధులు అండగా నిలిచారు. మృతురాలి కుటుంబ సభ్యులకు రెండు లక్షలు, మిగతా ఆరు కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికీ రూ.10,000 చొప్పున అందజేశారు. తెలంగాణ నుంచి వచ్చిన ఆ సంస్థ ప్రతినిధుల బృందం రావులచెరువు వెళ్లి క్షతగాత్ర కుటుంబాలకు సాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో శెట్టిబలిజ నాయకులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, మట్టపర్తి నాగేంద్ర, సంసాని బుల్లి నాని, గోవ్వాల రాజేష్‌, పిల్లి నాగ గోపాల కృష్ణ, పిల్లి గంగాధరరావు, దంగేటి సింహాచలం, మట్టపర్తి మీరా సాహెబ్‌ శెట్టి, రెడ్డి సత్య నాగేంద్రమణి, గొవ్వాల చిట్టూరి పెదబాబు, దొమ్మేటి రాము, కముజు రమణ, దొంగ చిన్న, కుడుపూడి భరత్‌ భూషణ్‌, కడలి బుల్లెట్‌ రాము, దంగేటి రుద్ర, గుత్తుల సల్మాన్‌ దొర, గుబ్బల ప్రసాద్‌, విత్తనాల శేఖర్‌, మట్టపర్తి హరి.కేతా భాను తేజ, రాయుడు షణ్ముఖ్‌, కట్ట శ్రీనివాస్‌, దంగేటి రుద్ర, వాసర్ల సుబ్బారావు, చెల్లుబోయిన నాని, అప్పారి రాఘవేంద్ర, వాసంశెట్టి జగదీష్‌. బొక్కా రామకష్ణ తదితరులు పాల్గొన్నారు.

➡️