సదస్సులో మాట్లాడుతున్న డాక్టర్ మంజీరా
ప్రజాశక్తి-ముమ్మిడివరం
ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పైన, గుండె సంబంధిత వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలని మంజీరా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత్రి డాక్టర్ మంజీరా సూచించారు. నగర పంచాయతీ పరిధిలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పీపుల్ సర్వీస్ ఆర్గనైజేషన్ లు సంయుక్తంగా ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహనా సదస్సు పీపుల్ సర్వీస్ సంస్థ గౌరవాధ్యక్షుడు టి.నాగరాజా రావు అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ మంజీరా మాట్లాడుతూ హదయాన్ని సంరక్షించుకోడం ఎంతో అవసరమని, గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఎల్లప్పుడూ సంతోషంగా నవ్వుతూ ఉండాలని, ప్రతి ఒక్కరు క్రమం తప్పకుండా హృదయ పరీక్షలు చేయించుకోవడం తప్పని సరి అన్నారు. అలాగే మంచి ఆహారపు అలవాట్లు, మంచి జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.ప్రభాకర్ మాట్లాడ ే ప్రతి ఒక్కరు కూడా వ్యాయామం జాగింగ్ చేయడం ఉత్తమం అన్నారు కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కన్నీడి వెం కటేశ్వరరావు, కళాశాల అధ్యాపకులు డాక్టర్ తులసి లక్ష్మి ,మహమ్మద్ ,సురేష్ రావు, అరవింద్ కళ్యాణ్, భువనేశ్వరి, కె శ్రీనివాసరావు మరియు పీపుల్ సర్వీస్ సంస్థ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.