రక్షణ చర్యలపై అవగాహన స్ఫూర్తిదాయకం

Mar 20,2025 23:03
IMG

జెండా ఊపి సైకిల్‌ ర్యాలీని ప్రారంభిస్తున్న డిఆర్‌ఒ

ప్రజాశక్తి – అమలాపురం

దేశ సమగ్రతను సమైక్యతను కాపాడుకునే కేంద్ర, పారిశ్రామిక భద్రతా దళాలు రక్షణ చర్యలపై సముద్ర తీర ప్రాంతాలలో అవగాహన కల్పించడం సంతోషకరం, స్ఫూర్తి దాయకమని జిల్లా రెవెన్యూ అధికారి బిఎల్‌ఎన్‌.రాజకుమారి పేర్కొన్నారు. ఈనెల 19న మలాపురం చేరుకున్న సైక్లోథాన్‌ సైకిల్‌ ర్యాలీ సభ్యులు స్థానికంగా బస చేసి తిరిగి గురువారం సముద్ర ప్రాంతంలోని నరసాపురం మీదుగా మచిలీపట్నం బయలుదేరిన స్థానిక గడియారపు స్తంభం జంక్షన్‌ వద్ద జండా ఊపి ఆమె ర్యాలీని పున: ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గుజరాత్‌ నుంచి కన్యాకుమారి వరకు నిర్వహిస్తున్న ఈ సైకిల్‌ ర్యాలీలో కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ తరఫున స్వాగతం పలుకుతూ తిరిగి సైకిల్‌ ర్యాలీని పున: ప్రారం భించానన్నారు. దేశ సమగ్రత సమైక్యతను కాపాడుకోవడం తోపాటుగా విపత్కర పరిస్థితులలో ఉగ్రవాదుల చర్యలను దీటుగా ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన అంశాలపై అవగాహన పెంపొం దించడం హర్షనీయమన్నారు. ఈ ర్యాలీని కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాల 56వ వ్యవస్థాపక దినోత్సవం పురస్కరించుకొని రెండు టీము లుగా సుమారు 6,550 కిలోమీటర్ల మేర నిర్వహించి దేశ ప్రజలకు పారిశ్రామిక భద్రత, ఉగ్రవాద చర్యల నుంచి రక్షణ పొందేందుకు కల్పిస్తున్న అవగాహన కార్యక్రమాలు అభినం దనీయమన్నారు. కార్య క్రమంలో దళా డిప్యూటీ కలెక్టర్‌ ఎకె.ప్రభాకర్‌, తహశీల్దార్‌ అశోక్‌ కుమార్‌, పోలీస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

➡️