మాట్లాడుతున్న ఎంఇఒ పివి.సుబ్బరాజు
ప్రజాశక్తి – ఆలమూరు
మండలంలోని చెముడులంక ఎస్‌టిఎస్‌ఎన్‌ఎం జడ్‌పి హైస్కూల్లో మంగళవారం కిశోర బాలికల వికాసంపై ఐసిడిఎస్ ఆధ్వర్యంలో హెచ్‌ఎం శ్రీరామ్ కుమార్ అధ్యక్షతన విద్యార్థినులకు అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఇఒ పివి.సుబ్బరాజు మాట్లాడుతూ . కిషోర బాలికల వ్యక్తిత్వ వికాసం వద్ధి చెందేలా అందరూ సమిష్టిగా కషి చేయాలని పిలుపునిచ్చారు. ఇందులో వ్యక్తిగత ఆరోగ్యం, రక్త హీనత, మహిళా అక్రమ రవాణా, లింగ వివక్ష, బాల్య వివాహాలు నిర్మూలనకు తీసుకోవలసిన జాగ్రత్తలను వారువివరించారు. విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలను ఉపాధ్యాయులు తెలుసుకుని సత్వరమే పరిష్కరించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసిస్టెంట్ దుర్గా, ఎఎన్‌ఎం మంగాయమ్మ, సూపర్వైజర్లు టిఎన్‌వి.నాగలక్ష్మి, వై.అరుంధతి, సిఆర్‌పి శ్రీనివాస్, అంగన్‌వాడీలు సుశీల, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.