రెండు వర్గాలు పరస్పర దాడులు

May 14,2024 23:02

ఆత్రేయపురం రావి చెట్టు సెంటర్లో పోలీస్‌ పికెట్‌

ప్రజాశక్తి-ఆత్రేయపురం

సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని సోమవారం మహాత్మా గాంధీ కళాశాల్లో 26వ పోలింగ్‌ బూత్‌ లో వైసిపి, టిడిపి వర్గాల మధ్య ఘర్షణ జరిగాయి. ఈ ఘర్షణలో వైసిపి వర్గం టిడిపి మండల అధ్యక్షుడుపై దాడికి దిగి గాయపరిచారు. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో గొడవలు సద్దుమణిగాయి. పోలింగ్‌ సవ్యంగా జరిగింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం వైసిపి నాయకుడైన వేగేశ్న గోపి వాట్సాప్‌లో టిడిపి నాయకులకు మెసేజ్‌ పెట్టడంతో ఘర్షణకు దారి తీసింది. టిడిపి వర్గీయులు రావి చెట్టు సెంటర్‌ కి వచ్చి మళ్లీ గొడవ పడి వైసిపి నాయకుడు గోపిని గాయపరిచారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో గ్రామంత పోలీసు బలగాలు మోహరించాయి. ఈ దాడుల్లో ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుల్‌ కు స్వల్ప గాయాలయ్యాయి. సంఘన స్థలాన్ని డిఎస్‌పి కెవి.రమణ, సీఐ రామకుమార్‌ చేరుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలుపురస్కరించుకుని టిడిపి, వైసిపి నాయకులు కవింపు చర్యలకు దిగడంతో ఉధత పరిస్థితులు ఏర్పడ్డాయని గొడవలు కారమైన వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. అలాగే నియోజకవర్గానికి చెందిన నాయకులు వచ్చి రెండు వర్గాలు ఎటువంటి గొడవలు లేకుండా చూశారు కొట్లాటలో రెండు వర్గాలపై కేసులు నమోదు సార్వత్రిక ఎన్నికల పురస్కరించుకుని ఓటు వేయడానికి వెళ్లే సమయంలో రెండు వర్గాలు ఘర్షణ కు పాల్పడి ఒకరినొకరు దాడి చేసుకున్న గాయపరచుకున్న సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారి వివరాలు ప్రకారం మండల కేంద్రం ఆత్రేయపురం గ్రామానికి చెందిన చెందిన వేగేశ్న వెంకట కృష్ణంరాజు తమ్ముడు భాస్కర విజయ నరసింహరాజు ఓటు వేయడానికి వెళ్లినప్పుడు గ్రామానికి చెందిన ముదునూరి బద్రిరాజు కొంతమందితో కలిసి ఘర్షణ పడ్డాడు. ఈ విషయం సద్దుమణిగింది మంగళవారం కృష్ణంరాజు ఉదయం 9 గంటలకు రావిచెట్టు వద్దకు రమ్మని తేల్చుకుందామని వాట్సాప్‌ మెసేజ్‌ పెట్టాడు. ఉదయం 9 గంటల సమయంలో కృష్ణంరాజు తన తమ్ముడు తో రావి చెట్టు వద్ద ఉండగా ముదునూరి బద్రిరాజు తన వర్గీయులను తీసుకుని వెళ్లి ఒకరినొకరు దుర్బాష లాడుకుని కవ్వింపు చర్యలు పాల్పడి దాడి చేసుకుని గాయపరచుకున్నారు. రెండు వర్గాలకు గాయాలయ్యాయి. రెండు వర్గాల వారి ఫిర్యా దులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఎస్‌.శ్రీనివాస్‌ తెలిపారు.

 

➡️