17 నుంచి వెంకన్న బ్ర్రహ్మోత్సవాలు

Feb 11,2025 16:44
venkanna

చింతలూరులో వివరాలు వెల్లడిస్తున్న ఆలయ కమిటీ సభ్యులు

ప్రజాశక్తి – ఆలమూరు

మండలంలోని చింతలూరు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి ద్వితీయ వార్షిక బ్రహ్మోతవాలు ఈ నెల 17 నుంచి 22 వరకు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహక కమిటీ సభ్యులు తెలిపారు. ద్వితీయ పాంచాహ్నిక బ్రహ్మోత్సవాలకు సంబంధించిన వివరాలను కమిటీ ఆలయ ప్రాంగణంలో మంగళవారం విలేకరులతకు తెలియజేశారు. గత ఏడాది జరిగిన ఉత్సవాలకు యాత్రికులుకు విశేష సంఖ్యలో పాల్గొన్నారన్నారు. ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్కరూ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని కోరారు.

➡️