ఫీజు పోరు విజయవంతానికి పిలుపు

Feb 2,2025 17:36
IMG-

సిరిపల్లిలో ఫీజుపోరు పోస్టర్లఆవిష్కరణలో గన్నవరపు శ్రీనివాసరావు

ప్రజాశక్తి – అయినవిల్లి

వైసిపి ఆధ్వర్యంలో ఈ నెల 5న నిర్వహించ తలపెట్టిన ఫీజు పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ శ్రేణులకు పి.గన్నవరం నియోజకవర్గం ఇన్‌ఛార్జి గన్నవరపు శ్రీనివాసరావు ఆదివారం పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాలు మేరకు మండలం లోని సిరిపల్లి గ్రామంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ గన్నవరపు శ్రీనివాసరావు, మాజీ ఎంఎల్‌ఎ పాముల రాజేశ్వరిదేవి చేతులుమీదుగా ఫిబ్రవరి 5 న రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే ఫీజు పోరు పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భగా ఫీజు పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వైసిపి నాయకులకు, కార్యకర్తలకు తరలివారాలన్నారు. అయినవిల్లి మండల వైసిపి అధ్యక్షులు కుడుపూడి విద్యాసాగర్‌ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసిపీ నాయకులు మందపాటి కిరణ్‌ కుమార్‌ వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపిటిసి సభ్యులు, రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, సొసైటీ మాజీ ఛైర్మన్లు, వివిధ మార్కెట్‌ రంగాల అధ్యక్షులు, డైరెక్టర్లు, వివిధ కొర్పొరేషన్‌ ఛైర్మన్లు, గ్రామశాఖ అధ్యక్షులు, సచివాలయం కన్వీనర్లు, బూత్‌ కన్వీనర్లు, వార్డ్‌ మెంబర్లు, సోషల్‌ మీడియా వారియర్స్‌, కార్యకర్తలు, వైసిపి కుటంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

➡️