కె.గంగవరంలో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన రామచంద్రపుర ఆర్‌డిఒ
ప్రజాశక్తి – యంత్రాంగం
ఉభయ గోదావరి జిల్లా ఉపాధ్యా య ఎంఎల్‌సి నియోజకవర్గం ఉప ఎన్నిక గురువారం ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ సరళిని అధికారులు పరిశీలించారు. అమలాపురం: స్థానిక బాలుర జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఉపాధ్యాయ ఎంఎల్‌సి పోలింగ్ గురువారం ప్రశాంతం గా జరిగింది. 3296 ఓట్లుగాను 3198 మంది ఉపాధ్యాయులు తమ ఓటుహక్కును సద్వినియోగం చేసుకున్నారు. జిల్లాలో 95.21 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. ఎంఎల్‌సి ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ సరళిని పరిశీలించామని ఉభయగోదావరి జిల్లాల్లో ఎన్నికలు ప్రక్రియ ప్రశాంతంగా సజావుగా జరిగిందనియుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు అన్నారు.. గురువారం పశ్చిమగోదావరి జిల్లా, ఏలూరు జిల్లా, కోనసీమ జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌పి మనోహర్, యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జ్యోతిబసు, యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు పెంకె వెంకటే శ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంటివి.సుబ్బారావు, అసోసియేట్ అధ్యక్షులు పి.సురేంద్ర కుమార్, ట్రెజరర్ సిహెచ్.కేశవరావు, జిల్లా కార్యదర్శిలు జివి.రమణ, టి.దుర్గాప్రసాద్, కెవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి, ప్రజా సంఘాల నాయకులు కారెం వెంకటేశ్వరరావు, దుర్గాప్రసాద్, బలరాం, కృష్ణవేణి, నాగ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కొత్తపేట: కొత్తపేట డివిజన్ లోని ఏడు మండలాల్లోని టీచర్ ఎంఎల్‌సి ఎన్నికల్లోను 96.28 శాతం ఓటింగ్ జరిగినట్లు కొత్తపేట ఆర్‌డిఒ శ్రీకర్ తెలిపారు. మామిడికుదురు: స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ఎంఎల్‌సి పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోలింగ్ శిబిరాన్నిగురువారం పిడిఎఫ్ ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు, రాష్ట్ర యుటిఎఫ్ అధ్యక్షులు ఎన్. వెంకటేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు మనోహర్, రాష్ట్ర కార్యదర్శి జ్యోతిబసు, డివి.రాఘవులు, ఆండ్ర మాల్యా ద్రి సందర్శించారు. ఈ పోలింగ్ శిబిరం లో జిల్లా యూత్ నాయకులు సిహెచ్ కేశవరావు ,కుడుపూడి సత్యనారాయణ మండల యూటీఎఫ్ నాయకులు పాల్గొన్నారు. కాట్రేనికోన: స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని అమలాపురం ఆర్‌డిఒ కె.మాధవి పరిశీలించారు. రామచంద్రపురం: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటింగ్ వివరాలను రామచంద్రపురం డివిజన్ అధికారి దేవర కొండ అఖిల వివరించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ బూత్‌లను, పోలింగ్ శాతాన్ని ఆమె విలేకరులకు తెలియజేశారు. రామచంద్రపురం – 94శాతం, కె.గంగవరం-90, మండపేట-93 శాతం, రాయవరం- 93 శాతం, కపిలేశ్వరపురం – 96 శాతం ఎన్నికల పోలింగ్ శాతం నమోదైందని ఆమె తెలియ జేశారు. పట్టణంలో తహశీల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాన్ని రామచంద్రపురం ఆర్‌డిఒ దేవరకొండ అఖిల పర్యవేక్షించారు. శాంతి భద్రతలను రామచంద్రపురం డిఎస్‌పి బి.రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. రామచంద్రపురం మండలంలో మొత్తం 414 ఓట్లు నమోదు కాగా వాటిలో 393 ఓట్లు పోలయ్యాయి. పురుషులు 243, ఓట్లు మహిళలు 151 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 94.93 శాతం ఓట్లు పోలయ్యాయని రామచంద్రపురం తహశీల్దార్ ఎం సావిత్రి తెలిపారు. అదేవిధంగా కె.గంగవరం మండల ంలోని 76 ఓట్లు నమోదు కాగా 69 ఓట్లు పోల య్యాయి. ఇక్కడ పురుషుల 52 ఓట్లు నమోదు కాగా మహిళలు 17 మంది ఓటు వేశారు. మొత్తం 91 శాత ం ఓట్లు నమోదైనట్లు కె.గంగవరం తహశీల్దార్ బండి మృత్యుంజయరావు తెలియజేశారు. కె.గంగవరం : మండలంలో మొత్తం 76 ఓట్లు ఉపాధ్యాయులు నమోదు కాగా వీటిలో 55 మంది మాత్రమే మధ్యాహ్నం రెండు గంటలు వరకు పోలింగ్ నమోదయింది. ఎన్నికల కేంద్రాన్ని ఆర్‌డిఒ డి.అఖిల, కె. గంగవరం తహశీల్దార్ బండి మృత్యుంజయులు పరిశీలించారు.ఆలమూరు : స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలోని ఓటింగ్ సరళిని కొత్తపేట ఆర్‌డిఒ పి.శ్రీకర్ పరిశీలిం చారు. ఐ.పోలవరం: తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో 66మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆత్రేయపురం: స్థానిక మండల మహిళా సమైక్య భవనంలో గురువారం జరిగిన ఉపాధ్యాయుల ఎంఎల్‌సి ఉప ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. 44 ఓట్లు గాను 30 మంది పురుషులు 13 మంది మహిళలు మొత్తం 43 మంది ఉపాధ్యాయులు తమ ఓట్లను వేశారు 97. 72 శాతం ఓటింగ్ నమోదయింది. ముమ్మిడివరం: స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో ఓటింగ్ జరిగింది. మండలంలో 137 ఓట్లకు గాను 130 ఓట్లు పోలవ్వగా, 94.89 శాతం మంది ఓటును వినియోగించుకున్నట్లు ఎఇ ఆర్‌ఒమరియు తహశీల్దార్ ఎం సుబ్బలక్ష్మి తెలిపారు. రావులపాలెం: స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 53 పోలింగ్ కేంద్రాన్ని ఆర్‌డిఒ పి.శ్రీకర్ పరిశీలించారు. పోలింగ్ సరళిని పిఒ ఆనంద్ కిరణ్ ను అడిగి తెలుసుకున్నారు. ఉప్పలగుప్తం: ఎంఎల్‌సి ఎన్నిక ఓటింగ్ ప్రక్రియ కోసం ఎంపిడిఒ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ నెం.66లో 55 ఓట్లకు గాను 54 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎం.ఆనందబాబు తెలిపారు. పోలింగ్ ప్రక్రియను అమలాపురం ఆర్‌డిఒ కె.మాధవి, తహశీల్దార్ విఎస్ దివాకర్ పరిశీలించారు. కపిలేశ్వరపురం: స్థానిక మండల పరిషత్ కార్యాల యంలో ఎంఎల్‌సి ఓటింగ్ కు సంబంధించి ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో 56 మంది ఉపాధ్యాయ ఓటర్లకు 56 మంది తమ ఓటు హక్కు వినియో గించుకున్నట్లు తహశీల్దార్ పి.చిన్నారావు తెలిపారు.