ప్రజాశక్తి-కపిలేశ్వరపురం: కపిలేశ్వరపురం మండలం అంగరలో ఆదివారం కామ్రేడ్ తోరాటి లక్ష్మణమూర్తి 98వ జయంతిని అంగర, పడమర ఖండ్రిక గ్రామాల ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. స్వాతంత్రం అనంతరం పేదలకు భూములు పంచాలంటూ తెలంగాణలో సాగిన సాయుధ పోరాటంలో అంగరకు చెందిన తోరాటి లక్ష్మణమూర్తి పాల్గొన్నారు. అక్కడ పోలీసుల కాల్పుల్లో వీరమరణం పొందారు. అప్పటి నుంచి గ్రామంలో లక్ష్మణమూర్తి జయంతిని ఇరు గ్రామాల ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఆదివారం స్థానిక తోరాటి లక్ష్మణమూర్తి విజ్ఞాన కేంద్రం వద్ద అమరవీరుల స్మారక స్థూపం వద్ద నివాళి అర్పించారు. అంగర, పడమర ఖండ్రిక, గ్రామాల సర్పంచ్లు వాసా కోటేశ్వరావు, తిరునాతి ఆదిలక్ష్మి, ఉప సర్పంచ్ యర్రా వీరన్నబాబు, విజ్ఞాన కేంద్రం నిర్వాహక కమిటీ నాయకులు పెద్దింశెట్టి లక్ష్మణమూర్తి ఆధ్వర్యంలో జయంతిని నిర్వహించారు. అంగర గాంధీ సెంటర్లోని లక్ష్మణమూర్తి నిలువెత్తు విగ్రహం వద్ద నివాళి అర్పించారు. సీనియర్ సిటిజన్ సంకాబత్తుల ఎర్రబ్బులును ఘనంగా సత్కరించారు. ఇరు గ్రామాల ప్రముఖులు ప్రజా సంఘాల నాయకులు జిత్తుక మల్లిఖార్జునుడు , ముత్తా అబ్బు, పసలపూడి కృష్ణ, పడాల రాంబాబు, చీకట్ల గంగరాజు, ముత్తా త్రిమూర్తులు, యానాల సుబ్బారావు, ఆటో యూనియన్మా నాయకులు మాట్లాడుతూ లక్ష్మణమూర్తి అంగర గ్రామానికి చెందినవారు కావడం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో ఇరు గ్రామాల ప్రముఖులు పాల్గొన్నారు.
