సిఐఎస్‌ఎఫ్‌ సైకిల్‌ ర్యాలీకీ ఘన స్వాగతం

Mar 19,2025 22:20
IMG-

అమలాపురంలో ర్యాలీ నిర్వహిస్తున్న సిఐఎస్‌ఎఫ్‌ సభ్యులు

ప్రజాశక్తి – అమలాపురం

స్థానిక గడి యారపు స్తంభం జంక్షన్‌ వద్దకు సిఐఎస్‌ఎఫ్‌ సైక్లోథాన్‌ (సైకిల్‌ ర్యాలీ) బుధవారం సాయంత్రం చేరుకుంది. ఈ సందర్బంగా ఆర్మీ థీమ్‌, దేశ భక్తి గీతాలు ప్రదర్శన పట్టణ పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించి సైక్లోథాన్‌ సభ్యులకు స్వాగతం పలుకుతూ సాంస్కతిక కార్యక్రమా లు ఘనంగా నిర్వహించారు. సైక్లోథాన్‌ సైకిల్‌ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ కమాండర్‌ వికె.ప్రభాకర్‌ మాట్లాడుతూ ‘సురక్షిత తీరాలు సంప న్న భారతదేశం” అనే స్ఫూర్తిదాయకమైన అంశమే లక్ష్యంగా తీరప్రాం తాలలో జాతీయ భద్రత గురించి అవగాహన పెంచడంతో పాటుగా మాద కద్రవ్యాలు, ఆయుధాలు పేలుడు,పదార్థాలతో సహా అక్రమ రవాణా వల్ల కలిగే ముప్పులను హైలైట్‌ చేయ డమే లక్ష్యంగా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అసిస్టెం ట్‌ కమాండర్‌ ఏకే సింగ్‌ మాట్లాడుతూ అంకిత భావం తో కూడిన సైక్లి స్టులు 25 రోజులపాటు 11 రాష్ట్రాలను కవర్‌ చేస్తూ కఠినమైన ప్రయా ణాన్ని చేపట్టామన్నారు. ఈ యాత్ర మార్చి 7, 2025 న ప్రా రంభమైన ఈ సైక్లోథాన్‌ ర్యాలీ పశ్చిమ తీరం లోని గుజరాత్లోని లఖ్పత్‌ నుంచి మార్చి 31, 2025న కన్యాకుమారి లోని స్వామి వివేకానంద స్మారక చిహ్నం వద్ద సైక్లోధాన్‌ ర్యాలీ ముగుస్తుందన్నారు. అసిస్టెంట్‌ కమాండర్‌ ఎస్‌కె సప్తపది మాట్లాడుతూ మార్గమధ్యలో (సిఐఎస్‌ఎఫ్‌) బృందాలు, పాఠశాలల విద్యార్థులు ఎన్‌సిసి గ్రూపుల ప్రదర్శనలు సాంస్కకృతిక ప్రదర్శనలతో కూడిన బహుళ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఈ చారిత్రాత్మక కార్యక్ర మంలో భాగస్వాములు కావాలని (సీఐఎస్‌ఎఫ్‌) పౌరులను కోరుతుంద న్నారు. జిల్లా ఎస్‌పి బి. కష్ణారావు మాట్లాడుతూ సముద్ర మార్గం గుండా ఉగ్రవాదులు భారతదేశంలో ప్రవేశిం చకుండా అడ్డుకుంటారని మాదకద్రవ్యాల అక్రమ రవాణా అరికడతామని, ఆ దిశగా తీర ప్రాంత ప్రజలను అవగాహన పర్చడమే లక్ష్యంగా కేంద్ర పారిశ్రామిక భద్రత దళాల సైకిల్‌ ర్యాలీని కలకత్తా నుంచి కన్యాకుమారి వరకు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమం లో మున్సిపల్‌ కమిషనర్‌ కెవివిఆర్‌.రాజు, పోలీస్‌ సిబ్బంది, సైక్లోథాన్‌ క మాండర్‌ సభ్యులు శ్రీనివాస్‌, శ్రీకర్‌ లోహియా, మాజీ సైని కులు కటకం పూర్ణ చంద్ర రావు, వీరనారీలు అమ్మన్నమ్మ, వంజరాపు లక్ష్మి తది తరులు పాల్గొన్నారు.

➡️