అధికారులతో మాట్లాడుతున్న జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి
ప్రజాశక్తి – అమలాపురం
కొత్తపేట మండలం వానపల్లి గ్రామంలో గత ఏడాది ఆగస్టు 23న సిఎం ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామసభలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను త్వరితగతిన అమలుచేయాలని జెసి టి.నిషాంతి వివిధ శాఖలకు చెందిన జిల్లాస్థాయి అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టరేట్లో జెసి అధ్యక్షతన ముఖ్యమంత్రి హామీల పరిష్కార సరళి పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుమారు 30 హామీలను ఇచ్చారన్నారు. పల్లాలమ్మ దేవాలయం పార్కు ప్రాంగణ అభి వృద్ధి, గహ నిర్మా ణం, అంతర్గత రోడ్లు, సిసి రోడ్లు, డబ్ల్యూబిఎం రోడ్లు, గ్రావెల్ రోడ్లు, చెరువుల అభివృద్ధి, గోశాల నిర్మాణం, అభివృద్ధి పనులకు సంబంధించి గ్రామ సభలు తీర్మానాలు, బరియల్ గ్రౌండ్ అవెన్యూ ప్లాంటేషన్ ఫీల్డ్ చానల్స్ అభివృద్ధి పాఠశాలలకు ప్రహరీ నిర్మాణం డ్రెయినేజీ నవీనీకరణ, పర్యావరణ, పశువుల కొనుగోలుకు రుణాలు కల్పన వంటి ప్రక్రియలను సంబంధిత శాఖలు వారి వారి రాష్ట్ర స్థాయి అధికారులకు సమగ్రమైన ప్రతిపాదనలు ఎప్పటికప్పుడు పంపుతూ నిధు లుతోపాటు సాంకేతిక, పరిపాలన అనుమతులు కోరుతూ వారం వారం చేపట్టిన అభివద్ధి పనుల పురో గతిని అప్డేట్ చేస్తూ సిఎంఒ కార్యాలయానికి నివేదిక పంపాలని ఆదేశించారు. తహశీల్దార్ గృహ నిర్మాణ దరఖా స్తులపై విచారించి లబ్ధిదారుల అర్హతలను నిర్ధారిస్తూ వారికి అను వైన నివేశన స్థలాలకై భూసేకరణ చేపట్టాలని ఆదేశించారు. గహ నిర్మాణ సంస్థ ఇంజినీర్లు గహ నిర్మాణం మంజూ రుకు ఎప్పటికప్పుు చర్యలు వివిధ పథకాల వర్తింపు ద్వారా చేపట్టాలన్నారు .పంచాయతీ రాజ్, జిల్లా నీటి యజమాన్య సంస్థ అధికారులు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ అనుసంధానంతో మెటీరియల్ కాంపోనెంటుతో గ్రావెల్, సిసి రోడ్లు, చేపట్టిన రోడ్ల నిర్మాణ స్థితిగతులను ఎప్పటి కప్పుడు అప్డేట్ చేయా లని ఆదేశించారు. అవస రమైన అభివద్ధి పనుల కు నిధులు ఆయా శాఖాధిపతుల ద్వారా సమీకరించుకోవాలని ఆదేశించారు. వివిధ పనులకు సంబంధించి గ్రామ సభలను నిర్వహించి గ్రామసభల తీర్మానాలను తీసుకొని వాటి ప్రకారం పనులను చేపట్టాలన్నా రు. పశువుల గోశాలలకు నిర్మాణానికి సంబంధించి లబ్ధిదారులు ముందుకు రావడంలేదని పశుసంవర్ధక శాఖ అధికారులు సూచించగా ఈ విషయం స్థానిక శాసనసభ్యులు దృష్టికి తీసుకుని వెళ్లి మంజూరైన గోశాలలస్థానే శాసన సభ్యులు సూచించిన వేరే లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి అవకాశం కల్పించాలన్నారు. గోశాలలు కట్టుకోవడానికి నిరాకరించిన లబ్ధిదారులతో తమకు గోశాలలు అవసరం లేదన్న విషయాన్ని ధ్రువీకరిస్తూ లబ్ధిదారుల సంతకాలతో లిఖిత పూర్వకంగా నివేదికలు సేకరించాలన్నారు. పల్లా లమ్మ దేవాలయం వద్ద పార్కు గ్రీనరీ అభివద్ధికి చర్యలు వేగవంతం చేయాలన్నారు. పశువుల రుణాల కల్పనకు చర్యలు వేగిరపరచాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఒ బిఎల్‌ఎన్.రాజ కుమారి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు ఎస్.మధుసూదన్, పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ఇంజినీర్ పి.రామకృష్ణారెడ్డి, జిల్లా గహ నిర్మాణ సంస్థ అధికారి నరసింహారావు, జిల్లా అర్థ గణాంక అధికారి వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ సెక్షన్ సూపరింటెండెంట్ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.