ఇసుక తవ్వకాలపై కలెక్టర్‌ సమీక్ష

Nov 29,2024 17:07
IMG-

మాట్లాడుతున్న కలెక్టర్‌ మహేష్‌ కుమార్‌, పాల్గొన్న జెసి టి.నిషాంతి తదితరులు

ప్రజాశక్తి – అమలాపురం

జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం సభ్యులతో శుక్రవారం జిల్లా కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ అధ్యక్షతన నిర్వహించి ఇసుక రీచ్‌ల వారీగా ఇసుక తవ్వకాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ఇసుక రీచ్‌ ల ద్వా రా రోజువారీగా 20 వేల మెట్రిక్‌ టన్నులు ఇసుక తవ్వకాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కపిలేశ్వరపురం తాటిపూడి రీచులలో నీటి ప్రవాహం ఇంకా కొనసాగుతోందని రామచంద్రపురం ఆర్‌డిఒ డి.అఖిల కలెక్టర్‌ దష్టికి తీసుకువెళ్లారు. నీటి ప్రవాహం తగ్గిన వెంటనే నిర్దేశిత ఆపరేటింగ్‌ ఏజెన్సీల ద్వారా ఇసుక త్రవ్వకాలు ప్రారంభించాలని ఆదేశించారు. రోజువారీగా ఒక్కొక్క రీచ్‌ నుంచి సుమారుగా 500 మెట్రిక్‌ టన్నులు ఇసుక తవ్వకాలు చేపట్టాలని సూచించారు. నార్కెడుమిల్లి, ఆలమూరు పొడగట్లపల్లి రీచుల్లో డిసెంబర్‌ 1వ తేదీ నుంచి తవ్వకాలు ఆపరేటింగ్‌ ఏజెన్సీల ద్వారా చేపట్టాల న్నారు. ఆపరేటింగ్‌ ఏజెన్సీలు తవ్వకాల కొరకు ముందుకు రానిపక్షంలో నోటీసులు జారీ చేస్తూ సంప్రదింపులు జరిపి వివరణ కోరాలని ఆర్‌డిఒలకు సూచించారు. ఆపరేటింగ్‌ ఏజెన్సీలకు ఏవైనా సమస్యలు ఉంటే గుర్తించాలని సూచించారు రీచ్‌లల నుంచి స్టాక్‌యార్డ్‌కు, స్టాక్‌యార్డ్‌ నుంచి వినియోగదారులకు ఎంత పరిమాణంలో ఇసుక విక్రయించబడుతుందో రోజువారి నివేదికను సమర్పించాలని ఆదేశించారు. భవన నిర్మాణ రంగాలకు అవసరమైన డిమాండ్‌కు అనుగుణంగా ఇసుకను సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. కపిలేశ్వరపురం-2 నుంచి స్థానికంగా వినియోగం కొరకు ఎంత పరిమా ణంలో ఇసుకను తరలిస్తున్నది పంచాయతీ సిబ్బంది పర్యవేక్షించాలన్నారు. సొంత వినియోగానికి తరలిస్తున్నారా లేదా నిబంధనలకు విరుద్ధంగా మూడో వ్యక్తికి విక్రయిస్తున్నది నిశితంగా గమనించి అక్రమ రవాణా పై ప్రత్యేక దష్టి సారించాలన్నారు. పట్టా భూములలో ఇసుక ఎంత పరిమాణంలో ఉందో అధికారుల ద్వారా అంచనాలు వేసి ఆ మేరకు ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లలో తరలించుకు నేందుకు అనుమతులు గ్రామ సచివాలయాల స్థాయిలో ఇవ్వాలని సూచించారు. పట్టా భూముల్లో ఇసుక నిల్వలు ఉన్నాయని దరఖాస్తు చేసుకున్న వారికి జియో కోఆర్డినేట్లతో డిజిపిఎస్‌ సర్వే, ఎఫ్‌ఎల్‌సి సర్వేలను పూర్తి చేసి అప్రూవల్స్‌, డిసెంబ ర్‌ 6వ తేదీ నాటికి తదుపరి పర్యావరణ అను మతులు జారీ చేయాలన్నారు. స్థానిక వినియోగదారులు పోస్ట్‌ ఆడిట్‌ ద్వారా డెలివరీ సమాచారం అందుతుందని, సాధారణ, బల్క్‌ వినియోగదారులకు ఇసుక డిస్పాచ్‌ అనంతరం సమాచారం జనరేట్‌ అవుతుందన్నారు. ఇసుక స్థానిక అవసరాలకు వినియోగి స్తున్న తీరును పంచాయతీ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జెసి టి.నిషాంతి, జిల్లా గనులు భూగర్భ శాఖ ఎడి ఎల్‌.వంశీధర్‌ రెడ్డి, ఆర్‌డిఒలు డి.అఖిల, కె.మాధవి, పి. శ్రీకర్‌, కాలుష్య నియంత్రణ మండలి ఇఇ శంకర్రావు, జిల్లా రవాణా అధికారి డి.శ్రీనివాసరావు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఇ సిహెచ్‌ఎన్‌వి.కృష్ణారెడ్డి, ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ బి.రాము, జిల్లా వ్యవసాయ అధికారి బోసు బాబు, రియాల్టీ ఇన్‌స్పెక్టర్‌ టి.సుజాత తదితరులు పాల్గొన్నారు.

➡️