రామోజీ మృతికి కామన సంతాపం

Jun 8,2024 12:39 #Konaseema

ప్రజాశక్తి-అమలాపురం రూరల్ : అక్షరయోధుడు, ఈనాడు దిన పత్రిక వ్యవస్థాపకుడు రామోజీరావు అకాల మరణం పట్ల డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కామన ప్రభాకరరావు శనివారం తీవ్ర సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన రామోజీ రావు చిన్న స్థాయీ నుంచి ఎదిగి అనేక లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ముఖ్యంగా ఆసియా ఖండంలోనే గొప్ప సినిమా స్టూడియో(రామోజీ ఫిల్మ్ సిటీ)నిర్మించి చిత్ర పరిశ్రమ లోని వివిధ విభాగాలను ఏర్పాటు చేసిన ఘనత రామోజీ రావుదని పేర్కొన్నారు. ఫిల్మ్ సిటీని తెలుగు చిత్రాలతో పాటు బాలీవుడ్ చిత్రాలను నిర్మించడానికి కావలసిన వనరులను సమకూర్చి ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు. ఆయన మృతి తెలుగు ప్రజలకు తీరనదనీ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని కోరుకుంటున్నట్లు తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

➡️