క్రీడా పోటీల్లో విజేతలకు అభినందన

Oct 10,2024 21:47
టైక్వాండో' విజేతలను అభినందిస్తున్న ఎస్‌ఐ చిరంజీవి, కోచ్‌లు

టైక్వాండో’ విజేతలను అభినందిస్తున్న ఎస్‌ఐ చిరంజీవి, కోచ్‌లు

ప్రజాశక్తి-అంబాజీపేట

రాష్ట్ర స్థాయి టైక్వాండో పోటీల్లో విజేతలకు పలువురు గురువారం అభినం దనలు తెలిపారు. కోడూరులో ఈనెల 4,5 తేదీల్లో జరిగిన యు-19 స్కూల్‌ గేమ్స్‌ పోటీలలో అంబాజీపేట శ్రీనివాస టైౖక్వాండో క్లబ్‌ విజేత ఎబి.చైతన్య సిల్వర్‌ మెడల్‌, 6, 7, 8 తేదీల్లో తిరుపతిలో నిర్వహించిన యు-4, యు-17 స్కూల్‌ గేమ్స్‌ పోటీల్లో నందంపూడికి చెందిన ఎం.మౌనిక సిల్వర్‌ మెడల్‌ సాధించా రని కోచ్‌ పి.త్రిమూర్తులు తెలిపారు. విజేతలను ఎస్‌ఐ కె.చిరంజీవి, ఎంఇఒలు కె.వెంకటేశ్వరరావు, మోకా ప్రకాష్‌, హైస్కూల్‌ హెచ్‌ఎం సాయిరాం, విద్యాకమిటీ వైస్‌ ఛైర్మన్‌ బండారు అమ్మాజీ, పిఇటిలు ఆదిలక్ష్మి, సూర్యకుమారి, కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు అభినందించారు.’

➡️