ప్రజాశక్తి-అమలాపురం కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని స్థానిక కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యాన సోమవారం వివిధ ప్రభుత్వ శాఖల్లోని కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. ఈ ధర్నాలో పిడిఎఫ్ ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూకల బలరామ్, అధ్యక్షులు జి.దుర్గాప్రసాద్, సిఐటియు జిల్లా కోశాధికారి కె.కృష్ణవేణి మాట్లాడారు. పర్మినెంట్ ఉద్యోగులు చేసే పనినే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో పని చేయిస్తున్నప్పుడు పర్మినెంట్ ఉద్యోగులకు ఇచ్చే అన్ని సదుపాయాలూ వారికి కూడా ఇవ్వాలని సుప్రీంకోర్టు 2013లో ఇచ్చిన తీర్పును రాష్ట్రంలో ఏ శాఖలోనూ అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాలను అమలు చేయాల్సిన ప్రభుత్వాలే ఉద్యోగుల శ్రమను దోచుకోవడం అన్యాయమన్నారు. ఐక్యంగా ఉద్యమాన్ని ఉధతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పొలమూరి శ్రీను, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్‌రావు, అంగన్‌వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బండి వెంకటలక్ష్మి, ఆర్‌టిసి జిల్లా కార్యదర్శి గణపతి, ఉపాధ్యక్షులు ఏడుకొండలు, ఎఎన్‌ఎం నాయకులు మేరి, ఆగేష్, వరలక్ష్మి, 108 నాయకులు శ్రీనివాస్, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు ఆదిలక్ష్మి, మహాలక్ష్మి, స్వాతి, గీత, స్కూల్ శానిటేషన్ వర్కర్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుసుమ, లక్ష్మీదేవి, జార్జ్, సత్యనారాయణ, పరంధామయ్య పాల్గొన్నారు.