చొప్పెల్ల పంచాయితీ పారిశుధ్య కార్మికులకు వస్త్రాలు అందజేసిన సర్పంచ్ చంద్రకళ బాపనయ్య
ప్రజాశక్తి – ఆలమూరు
మండలంలోని చొప్పెల్ల పంచాయతీ వద్ద ఆ గ్రామ సర్పంచ్ దంగేటి చంద్రకళ బాపనయ్య పారిశుధ్య కార్మికులకు శనివారం నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ పారిశుధ్య నిర్వహణలో ప్రధాన భూమిక పోషిస్తున్న కార్మికులను గౌరవించుకోవడం మన కర్తవ్యం అన్నారు. ప్రతి కార్మికుడు తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ పారిశుధ్య నిర్వహణ ఎప్పటికప్పుడు సక్రమంగా నిర్వర్తించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి విజయ రెడ్డి, గుమస్తా శ్రీనివాస్, సత్తిబాబు, సుదర్శన్, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.