వికలాంగులు, వృద్ధులకు దుస్తుల పంపిణీ

Jan 15,2025 17:02
5alamuru1

దుస్తులు అందజేస్తున్న పినపళ్ల సర్పంచ్‌ సుభాష్‌

ప్రజాశక్తి – ఆలమూరు

రాజమహేంద్రవరం నగరంలోని సౌజన్య మనోవికాస్‌ సంస్థ నందు గల మానసిక వికలాంగులకు, స్వర్ణాంధ్ర వృద్ధుల ఆశ్రమంలో గల వృద్ధులకు జనసేన ఉమ్మడి తూర్పుగోదావరి కార్యదర్శి, పినపళ్ళ సర్పంచ్‌ సంగీత సుభాష్‌ దుస్తులు పంపిణీ చేశారు. వారి కుటుంబ సభ్యులు, ఆయన బుధవారం సంక్రాంతి పండుగ నేపథ్యంలో పూర్వీకులు, అన్న సంగీత సాయి జ్ఞాపకార్ధం కుటుంబ సభ్యులతో కలసి ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భగా సర్పంచ్‌ మాట్లాడుతూ పేదవారికి, ఆపన్నులకు అండగా నిలవడమే సంక్రాంతి స్ఫూర్తి అని అన్నారు. సంక్రాంతి పండుగ నాడు పెద్దలను, పూర్వీకులను స్మరించుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. వారి పేరుతో పేదలకు చేయూత నందించడం మన ఆచారమన్నారు. దీంతో సంస్థ నిర్వాహకులు సర్పంచ్‌ సుభాష్‌ ను కుటుంబ సభ్యులను అభినందించారు.

➡️