ఫ్రెండ్స్ షాపింగ్ మాల్ లో వికలాంగులతో మంత్రి సుభాష్
ప్రజాశక్తి – రామచంద్రపురం
పట్టణంలోని మానసిక వికలాంగులకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారికి కొత్త దుస్తులు అందజేశారు. తల్లిదండ్రులను కోల్పోయి ఆదరణ లేని ముచ్చుమిల్లి రోడ్డులో ఉన్న జోరు మినిస్ట్రీస్ బెతెస్త న్యూలైఫ్ సెంటర్ వికలాంగుల ఆశ్రమ పాఠశాలలో ఆశ్రయం పొందుతున్న మానసిక వికలాంగులతో కలిసి మంత్రి. ఒక ప్రత్యేక బస్సులో పట్టణంలోని రిలయన్స్ ట్రెండ్స్ షాపింగ్ మాల్ కి వారిని తీసుకొచ్చారు. సుమారు రెండు గంటలకు పైగా తన విలువైన సమయాన్ని వెచ్చించి మానసిక వికలాంగులకు దగ్గరుండి నూతన వస్త్రాలకు కొనిచ్చారు. మంత్రి సుభాష్. వారందరితో మాట్లాడారు. డిగ్రీ పూర్తి చేసుకున్న వికలాంగురాలు ఖండవల్లి దుర్గాదేవికి కాకినాడలోని వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్‌తో మాట్లాడి అక్కడికక్కడే ఉద్యోగం ఏర్పాటు చేశారు. అలాగే వికలాంగ ఆశ్రమ పాఠశాలను నిర్వహిస్తున్న అలెగ్జాండర్, ప్రిస్కిల్లా దంపతులను మంత్రి సుభాష్ అభినందించారు. మొత్తం అందరికీ కొత్త దుస్తులు కొన్న మంత్రి తిరిగి వారిని హాస్టల్కు చేర్పించారు. మంత్రి సుభాష్‌కు వికలాంగులు , హాస్టల్ సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.