ప్రజాశక్తి – ఆలమూరు : రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా ఆలమూరుకు చెందిన కృష్ణ ప్రభాస్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ డైరెక్టర్, పారిశ్రామికవేత్త వైట్ల కనకదుర్గారావు నియమితులయ్యారు. రాష్ట్ర కార్యవర్గం నుంచి ఈ మేరకు ఆయనకు సమాచారం అందించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సమస్యలపై పోరాడి సమస్యల పరిష్కారం చేయటంలో దుర్గారావు కీలక పాత్ర పోషించేవారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ట్రెజరర్ గా పనిచేశారు. రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీలో 35 ఏళ్ల అపార అనుభవం కలిగి ఉన్నారు. రాష్ట్ర కార్యవర్గంలో జాయింట్ సెక్రెటరీ పదవి కోసం ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎంపికలో రాష్ట్ర నాయకులు వైట్ల కనక దుర్గారావు పేరును సూచించడంతో ఆ మేరకు జాయింట్ సెక్రటరీగా నియమించారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా నియమితులైన వైట్ల కనకదుర్గారావును పలువురు రైస్ మిల్లర్స్, రైతులు అభినందించారు.