జూన్ 6 వరకు ఎన్నికల కోడ్

May 25,2024 12:04 #Konaseema
  • కౌంటింగ్ రోజు శాంతియుత వాతావరణానికి సహకరించాలి 
     ఆర్డీవో సుధా సాగర్

ప్రజాశక్తి-రామచంద్రపురం : సార్వత్రక ఎన్నికల ఫలితాలు ఈనెల 4న వెలువడనున్న నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులతో రామచంద్రపురం ఆర్డీవో కార్యాలయంలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు నాయకులు సహకరించారని అదేవిధంగా కౌంటింగ్ సమయంలోనూ శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఆయా పార్టీల నాయకులు సహకరించాలని ఆర్డీవో సుధా సాగర్ తెలియజేశారు. ఎన్నికల కోడ్ జూన్ 6 వరకు అమల్లో ఉంటుందని అందుచేత ఏ విధమైన అల్లర్లు జరగకుండా రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. సమావేశంలో రామచంద్రపురం డి.ఎస్.పి బి రామకృష్ణ, సిఐ పి. దొరరాజు మాట్లాడారు సమీపంలోని చెయ్యేరులో గల శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో కౌంటింగ్ జరుగుతుందని ఈ సందర్భంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని వివరించారు. కౌంటింగ్ అనంతరం జరిగే విజయోత్సవ ర్యాలీలు, బాణాసంచా కాల్చడం, రెచ్చగొట్టే పోస్టింగులు చేయడం వంటి వాటిని ఎవరు అతిక్రమించరాదని, ఎవరికి ఏ విధమైన అనుమతులు లేవని ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున తప్పనిసరిగా అన్ని పార్టీలు నిబంధనలను పాటించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ఎం వెంకటేశ్వర రావు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు, అన్ని పార్టీల రాజకీయ నాయకులు ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు.

➡️