ప్రజాశక్తి-మండపేట : 15వ వార్డు గొల్లపుంతలో పడిపోయిన విద్యుత్ స్తంభాలను తిరిగి వెంటనే పునరుద్ధరించాలని ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. ఆదివారం రాత్రి ఈదురుగాలుల దాటికి వార్డులో కొబ్బరి చెట్టు విద్యుత్ తీగలపై పడడంతో మూడు విద్యుత్ స్తంభాలు విరిగి నేలపై పడ్డాయి. ఎమ్మెల్యే వేగుళ్ళకు సమాచారం తెలియడంతో సంఘటన ప్రాంతాన్ని సందర్శించారు. రాత్రి చోటుచసుకున్న సంఘటన వివరాలను ఆయనఅడిగి తెలుసుకున్నారు. ఆ సమయంలో కరెంటు లేకపోవడం, వీధిలో జనం సంచరించకపోవడంతో ప్రమాదం తప్పిందని స్థానికులు వివరించారు. తక్షణమే విద్యుత్ స్తంభాలను పునరుద్ధరించాలని విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసి సరఫరా అందించాలని ఆదేశించారు..
