శాంతియుతంగా ఉత్సవాలను నిర్వహించాలి

Oct 10,2024 21:45
మాట్లాడుతున్న కొత్తపేటి డిఎస్‌పి గోవిందరావు

మాట్లాడుతున్న కొత్తపేటి డిఎస్‌పి గోవిందరావు

ప్రజాశక్తి – అంబాజీపేట

దసరా ఉత్సవాల సందర్భంగా నిర్వహించే భేతాళ స్వామి ఉత్సవాలు శాంతియుతంగా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కొత్తపేట డిఎస్‌పి గోవిందరావు అన్నారు. అంబాజీపేటలో ఈనెల 16న జరిగే భేతాళస్వామి ఉత్సవాల సంద ర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులతో గురువారం సమావేశం నిర్వహించారు. 13 వాహనాలు వద్ద వాలంటీర్లను నియమించుకోవాలని ట్రాఫిక్కుకు అంతరాయం కలగకుండా ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉత్సవాలు జరుపుకోవాలని పి.గన్నవరం సిఐ ఆర్‌ భీమరాజు ఉత్సవ కమిటీకి పలు సూచనలు చేశారు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. బాణసంచా కాల్పులతో పోటాపోటీ తల ప్రదర్శనలు తగవన్నారు. అన్నదాన సేవా కార్యక్రమాల్లో మీయొక్క బల ప్రదర్శనలు ప్రదర్శించుకోవాలన్నారు. స్వామి తీర్థ మహోత్సవాల్లో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కమిటీదే అన్నారు. ఈ సమావేశంలో ఎస్‌ఐ కె.చిరంజీవి, ఎంపిపి దొమ్మేటి వెంకటేశ్వరరావు, దొమ్మేటి రామారావు, జెడ్‌పిటిసి మాజీ సభ్యుడు బొంతు పెదబాబు, శీలం అర్జునరావు, దొమ్మేటి సత్య మోహన్‌, డి.సాయికష్ణ, డి.పరమేశ్వరరావు, మట్టపర్తి రాము, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

➡️