పామర్రు ఆరోగ్య కేంద్రంలో పాదరక్షలు పంపిణీ
ప్రజాశక్తి – కె.గంగవరం
పామర్రు పిహెచ్‌సిలోడాక్టర్ విష్ణువర్ధన్, డాక్టర పి.హర్షిత ఆధ్వర్యంలో కుష్టు వ్యాధిగ్రస్తులకు పాదరక్షలు పంపిణీ చేశారు. ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన స్పర్శ కార్యక్రమంలో జిల్లా డిప్యూటీ పారా మెడికల్ అధికారి మాధవరపు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీ వరకు స్పర్శ ప్రోగ్రాంలో భాగంగా ఆశా కార్యకర్తలంతా ఇంటింటకీ వెళ్లి కుష్టు వ్యాధిపై అవగాహన కల్పించాలన్నారు. ఎలిసిడిసి సర్వేలో జిల్లాలో ఇంత వరకుఊ 11 కొత్త కేసులను గుర్తించి చికిత్స అందించామన్నారు. అదేవిధంగా గత ఏప్రిల్ నుంచి జనవరి నెల వరకు 77 కొత్త కేసులను గుర్తించి చికిత్స అందించడమైనది ఈ కార్యక్రమంలో 11 మంది కుష్టు వ్యాధిగ్రస్తుల కు మైక్రో సెల్యులర్ రబ్బర్‌తో తయారు చేసిన పాదరక్షలు, అల్సర్ కిట్లు డాక్టర్ విష్ణువర్ధన్‌చే వ్యాధిగ్రస్తులకు అందించామన్నారు. చివరగా ఆశా కార్యకర్తల చేత దేశాన్ని కుష్టు రహిత దేశంగా చేయడానికి కృషి చేస్తానని ప్రమాణం చేయించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంప ిహెచ్‌ఒ ఎంఎస్‌ఎన్ రెడ్డి, నోడల్ పర్సన్ సుబ్బారావు, జిల్లా నోడల్ ఆఫీసర్ సిహెచ్.సూర్యారావు, ల్యాబ్ టెక్నీషియన్ త్రిమూర్తులు, ఎఎన్‌ఎంలు, ఆశాలు పాల్గొన్నారు.