పలువురికి ఉచిత వైద్య పరీక్షలు

May 14,2024 23:03

కుడుపూరులో ఏర్పాటుచేసిన వైద్యశిబిరం

ప్రజాశక్తి-యంత్రాంగం

పలుచోట్ల మంగళవారం ఉచిత వైద్యశిబిరాలు ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఉచిత వైద్యపరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. రామచంద్రపురం: కె.గంగవరం మండలంలోని కుడుపూరు గ్రామంలో మంగళవారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో 302 మందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. పేకేరు ఆరోగ్య కేంద్రం వైద్యులు ఎం శ్రీలక్ష్మి, ఇఎన్‌టి వైద్యులు మోహన్‌ బాబు, సిబ్బంది వైద్య సేవలు అందించారు. మరికొందరిని జిల్లా ఆస్పత్రికి రిఫర్‌ చేశారు. కుడుకూరు పరిసర ప్రాంతాల ప్రజలు ఈ ఆరోగ్య వైద్య శిబిరంలో వైద్య సేవలు పొందారు. మామిడికుదురు: నగరం హైస్కూల్లో మంగళవారం నగరం పిహెచ్‌సి వైద్యాధికారి స్వర్ణలత ఆధ్వర్యంలో 346 మందికి ఆరోగ్య సురక్ష వైద్య సేవలు అందించారు. గర్భిణులు, బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో సూపర్‌ వైజర్‌ ఏడుకొండలు, ఏఎన్‌ఎమ్‌ చంద్ర కుమారి సిబ్బంది పాల్గొన్నారు.

➡️