పశు వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తున్న డిడి గణపతిరావు
ప్రజాశక్తి – ఆలమూరు
పాడి రైతులు ఉచిత పశు వైద్య సేవలు వినియోగించుకోవాలని మండపేట ఎస్‌ఎహెచ్‌డిసి డిప్యూటీ డైరెక్టర్ .గణపతి రావు, ఆలమూరు ఎడి డాక్టర్ ఎల్.అనిత, మండపేట ఎడి డాక్టర్ ఎస్.ప్రశాంతి అన్నారు. మడికి శివారు చిలకలపాడు వినాయకుని గుడి సమీపంలో మండపేట ఎస్‌ఎహెచ్‌డిసి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత పశు వైద్య ఆరోగ్య రక్షణ శిబిరాన్ని గురువారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపశుసంతతి పురోభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఈ పశు వైద్య శిబిరంలో సుమారు 100 పశువులకు అల్ట్రా సౌండ్ స్కానింగ్ మిషన్‌తో గర్భ నిర్ధారణ, గర్భకోశ సంబంధిత వ్యాదులు వంటి వాటికి వైద్యులు ప్రత్యేక పరీక్షలు చేశారని వారు తెలిపారు. అలాగే గాలికుంటు వ్యాధి నివారణకు, వివిధ జంతువులకు సోకే వ్యాధులకు సంబంధించి నిరోధక టీకాలు వేసి సలహాలు సూచనలు అందజేశారు. ఇందులో భాగంగా మండపేట నుంచి15 మంది ట్రైనీ వైద్యులు పాల్గొని ప్రత్యేక వైద్య సేవలు అందజేశారు. అనంతరం పాడి రైతులకు వారంతా పశువుల ఆరోగ్య రక్షణకు సంబంధించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు దొండపాటి సుబ్బరాజు, కొత్తపల్లి నగేష్, కొత్తపల్లి కృష్ణ, ఈదల రమేష్, పాలూరి బుల్లబ్బాయి, పశు వైద్యులు డాక్టర్ డి.వినోద్ కుమార్, డాక్టర్ జి.భాను ప్రసాద్, మండపేట పశు వైద్యులు డాక్టర్ ఏజిఎన్వి ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.