ముగిసిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌

May 13,2024 23:44

అంబాజీపేట మండలంల వక్కలంక గ్రామంలో బారులు తీరిన ఓటర్లు

ప్రజాశక్తి-యంత్రాంగం

సార్వత్రిక ఎన్నికల సందర్భంగా డాక్టర్‌ బిఆర్‌. ంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో సోమవారం జరిగిన పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసిందని ఎన్నికల అధికారులు తెలిపారు. అమలాపురం : జిల్లా వ్యాప్తం గా ప్రశాంత వాతావరణంలో సజావుగా పోలింగ్‌ ప్రక్రియ కొనసా గినట్లు జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా వెల్లడించారు. స్థానిక ఈదరపల్లి మండల ప్రజా పరిషత్‌ పాఠశాల నందు 87 వ నెంబరు పోలింగ్‌ కేంద్రం నందు జిల్లా కలెక్టర్‌ జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా తమ ఓటు హక్కును వినియోగిం చుకున్నారు. స్థానిక కలెక్టరేట్‌ లోని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ లో జిల్లా వ్యాప్తంగా జరుగు తున్న పోలింగ్‌ సరళిని ఆయన, జిల్లా ఎస్‌పి ఎస్‌. శ్రీధర్‌ వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా వీక్షించి పర్యవేక్షించారు. స్థానిక మండల పరిధిలోని వేమవరం గ్రామంలోని పోలింగ్‌ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ ఎన్నికల అధికారి హి మాన్షు శుక్లా, జిల్లా ఎస్‌పి ఎస్‌.శ్రీధర్‌ సందర్శించి పోలింగ్‌ సరళి విధానాన్ని క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించారు. సాయంత్రం 6 గంటలకు క్యూలైన్లలో ఉన్న ఓటర్ల అందరికీ టోకెన్లు అందించి ఓటింగ్‌ ప్రక్రియ పూర్తి చేసేందుకు వీలుగా ఫ్లడ్‌ లైటింగ్‌ ఏర్పాట్లు నిరంతరం విద్యుత్‌ సరఫరా ఏర్పాట్లు సుమారు 1600 పోలింగ్‌ కేంద్రాలలో కల్పించామని కలెక్టర్‌ తెలిపారు. రామచంద్రపురం: ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఓటర్లు ఉదయం 7 గంటలకే ఓటు హక్కు వినియోగించు కోవాలని క్యూలు కట్టారు. తోటపేట గ్రామంలోని 92వ పోలింగ్‌ బూత్‌ లో వివి పేడ్‌ నిర్వహించడంతో అర గంటసేపు ఓటింగ్‌ నిలిచిపోయింది. రామచంద్రపురం నియోజకవర్గం జిల్లాలో అతివేగంగా ఓట్లు నమోదు చేసి పోలింగ్లో ముందు శాతం లో నిలిచింది. కపిలేశ్వరపురం: మండలంలోని 19 గ్రామ పంచాయతీ పరిధిలో 54,075 మంది ఓటర్లు ఉండగా వీరిలో పురుషులు 26,867మంది, మహిళలు 27,208 మంది ఓటు హక్కును వినియోగిం చుకున్నారు. ఆత్రేయపురం : మండలంలోని 17 గ్రామాలలో ఎన్నికలు స్వల్ప ఘర్షణ మధ్య ప్రశాంతంగా జరిగాయి 62 పోలింగ్‌ కేంద్రాల్లో 54,220 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు లొల్ల 37వ పోలింగ్‌ బూత్‌ లో ఈవీఎం సాంకేతి లోపంతో మొరాయించడంతో గంట ఆలస్యంగా ఓటింగ్‌ మొదలైంది. ఆత్రేయపురం లో టిడిపి, వైసిపి శ్రేణుల మధ్య ఘర్షణ ఏర్పడడంతో ఒకరినొకరు కవింపు చర్యలు దిగారు. పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. మామిడికుదురు: పెదపట్నం లంక, బి.దొడ్డవరం, అప్పనపల్లి పాశర్లపూడి, లూటుకుర్రు తదితర గ్రామాలలో కూటమి బలపరిచిన అమలాపురం పార్లమెంట్‌ టిడిపి అభ్యర్థి గంటి హరీష్‌ మాథూర్‌, కూటమి బలపరిచిన పి.గన్నవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఎంఎల్‌ఎ అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ పోలింగ్‌ సరళి ని పరిశీలించారు. మామిడి కుదురు మండల పరిధిలో 18 గ్రామాల్లో ప్రశాంత వాతావరణంలో పోలింగ్‌ కొనసా గిందని పి.గన్నవరం సిఐ ప్రశాంత్‌ కుమార్‌ తెలిపారు. ఆదురులో ఈవీఎంలు మోరాయించడంతో కొద్దిసేపు పోలింగ్కి అంతరాయం కలిగింది. ఉప్పలగుప్తం: మండలం లోని 17 గ్రామ పంచాయతీల పరిధిలో గల 52 పోలింగ్‌ కేంద్రాలలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగిం చుకున్నారు. కొన్ని పోలింగ్‌ కేంద్రాలలో ఇవిఎం లు మొరాయించడంతో పోలింగ్‌ సుమారు గంట సమయం ఆలస్యమై ఓటర్లు ఇబ్బంది పడ్డారు. కూటమి బలపరిచిన అమలాపురం నియోజకవర్గ టిడిపి ఎంఎల్‌ఎ అభ్యర్థి అయితా బత్తుల ఆనందరావు తన స్వగ్రామమైన ఎస్‌.యానాంంలో ఓటు హక్కును వినియోగించుకోగా, గోపవరంలో మాజీ ఎంపీ ఎజెవి.బుచ్చి మహేశ్వరరావు ఆయన సతీమణి ఇందిర కుమార్తె సత్య శ్రీ, కుటుంబ సభ్యులు వినియోగించుకున్నారు. చల్లపల్లిలో ఇండిపెండెంట్‌ అభ్యర్థి వరసాల సత్యనారాయణ, జగ్గరాజుపేటలో వైసిపి నేత గుడ్‌ సీడ్‌ ఫౌండేషన్‌ ఫౌండర్‌ కుంచే రమణారావు ఆయన భార్య సునీత తల్లి సత్యవతి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజోలు: నియోజకవర్గంలో పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. శివకోటి గ్రామంలో పొలింగ్‌ బూత్‌ ల వద్ద ఓటర్లకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలమైనారు. అంబాజీపేట: పోలింగ్‌ ప్రక్రియలో భాగంగా అంబాజీపేట హైస్కూల్‌ నందు 116,117 బూత్‌లను వద్ద నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికారి శ్రీరామచంద్రమూర్తి సందర్శించారు. అంబాజీపేట, పుల్లేటికుర్రు పలు గ్రామాలలో గంటలు కావస్తున్నా ఈవిఎం లు మొరాయించడంతో పలు గ్రామాలలో అక్కడక్కడా వర్షం పడడంతో ఓటర్లు కొంత ఉపశమనం పొందారు. పి.గన్నవరం సిఐ ప్రశాంత్‌ కుమార్‌, అంబాజీపేట ఎస్‌ఐ చిరంజీవి ల ఆధ్వర్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ముమ్మిడివరం: నగర పంచాయతీ పరిధిలోని పెట్టా వారి పేట 25వ పోలింగ్‌ బూత్‌ లోను, జెడ్‌పి బాలుర హైస్కూల్‌ పోలింగ్‌ బూత్‌ 16 ,17 కేంద్రాల్లో ఇవిఎం లు మొరాయించడంతో అరగంట లేటుగా పోలింగ్‌ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్‌ ముగిసే సమయానికి 74.61 శాతం పోలింగ్‌ నమోదయింది. ఎంఎల్‌ఎ పొన్నాడ సతీష్‌ కుమార్‌ తమ కుటుంబ సభ్యులతో కలిసి నగర పంచాయతీ పరిధిలోని 16వ వార్డు ప్రాంతమైన చిప్పలపాలెం పోలింగ్‌ బూత్‌ నెంబర్‌ 28 లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే కూటమి బలపరిచిన ముమ్మిడివరం నియోజకవర్గం టిడిపి ఎంఎల్‌ఎ అభ్యర్థి దాట్ల సుబ్బరాజు భార్యతో కలిసి మురమళ్ళ పోలింగ్‌ బూత్‌ 141 కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇతర రాష్ట్రాలు మరియు విదేశాల నుంచి సుమారు 8 నుండి 10 వేల మంది ఓటర్లు నియోజకవర్గానికి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే ఐ.పోలవరం మండలం తిల్లకుప్పలో వైసిపి, టిడిపి కార్యకర్తలు మధ్య వివాదం తోపులాటకు దారితీసింది. కొత్తపేట వాడపాలెం పోలింగ్‌ బూత్‌ 168 లో కూటమి బలపరిచిన కొత్తపేట నియోజకవర్గ టిడిపి ఎంఎల్‌ఎ అభ్యర్థి బండారు సత్యానందరావు తన ఓటు హక్కును వినియోగించు కున్నారు. ఆలమూరు: పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంత వాతావ రణంలో కొన సాగిందని మండల ఎన్నికల అధికారి, తహశీల్దార్‌ డివిఎన్‌.అనిల్‌ కుమార్‌ తెలిపారు. సోమవారం సాయంత్రం 6 గంటలకు క్యూలైన్లలో ఉన్న ఓటర్ల అందరికీ టోకెన్లు అందించామన్నారు.

➡️