పి.గన్నవరం గ్రామ సభ సమావేశంలో మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ గిడ్డి
ప్రజాశక్తి -పి.గన్నవరం
పి.గన్నవరం గ్రామపంచాయతీ వద్ద సర్పంచ్ బొండాడ నాగమణి అధ్యక్షతన బుధవారం జరిగిన గ్రామ సభకు పి.గన్నవరం ఎంఎల్‌ఎ గిడ్డి సత్యనారాయణ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉంటే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారని, ప్లాస్టిక్ రహిత సమాజానికి మనమంతా కృషి చేయాలని గడచిన 110 రోజుల్లో దాదాపు రూ.12 కోట్ల గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను మన నియోజకవర్గానికి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేటాయించారన్నారు. ఈ నిధుల ద్వారా గ్రామాల్లో రోడ్లు, డ్రెయిన్లు, త్రాగునీరు వంటి వాటిపై ప్రత్యేకంగా వెచ్చిస్తామన్నారు. పంచాయతీ కి సిసి.రోడ్ల నిర్మాణానికి రూ.30 లక్షలు కేటాయించామన్నారు. గాంధీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం సాధించడానికి తగిన కార్యాచరణ తో ఎన్‌డిఎ కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందని అన్నారు.అనంతరం పంచాయతీ పారిశుధ్య కార్మికులను సత్కరించి సర్టిఫికెట్స్ అందజేశారు.ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.