ప్రజాశక్తి – ఆలమూరు : మండలంలోని చెముడులంకలో మాజీ ఎంపీటీసీ నాగిరెడ్డి వెంకటేశ్వరరావు(బాస్), మాజీ డిసి చైర్మన్ నాగిరెడ్డి వెంకటరత్నం ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వృద్ధులకు, విద్యార్థులకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నేతాజీ స్కూల్ కరస్పాండెంట్ తుమ్మ శ్రీనివాసరావు, కూటమి నాయకులు పడాల అమ్మిరాజు, కొత్తపల్లి రామకృష్ణ, కూటమి నాయకులు నాగిరెడ్డి సత్యానందం, గుండుమల్ల రాంబాబు, శిరంగుల సతీష్, నాగిరెడ్డి శ్రీను, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.