పాపారావు ఆధ్వర్యంలో మురళీకృష్ణ పుట్టినరోజు వేడుకలు
ప్రజాశక్తి – ఆలమూరు
మండల కేంద్రానికి చెందిన పారిశ్రామికవేత్త, శ్రీమురళీకృష్ణ సంస్థల అధినేత, కొత్తపేట నియోజకవర్గ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వంటిపల్లి పాపారావు తనయుడు వంటిపల్లి మురళీకృష్ణ పుట్టినరోజు వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను పెద్దపళ్ల శ్రీ మురళీకృష్ణ రైస్ మిల్, ఈతకోట శ్రీకృష్ణ రైస్ మిల్ స్టాఫ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా వారంతా మురళీకృష్ణకు పూలమాలలు బొకేలు అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మురళీకృష్ణ సంస్థల ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ వేడుకల్లో సంస్థ అధినేతలు వంటిపల్లి కృష్ణమూర్తి, వంటిపల్లి పాపారావు, కుటుంబ సభ్యులు, సంస్థ స్టాఫ్ పాల్గొన్నారు.